Fourth wave covid-19: దేశంలో ఫోర్త్ వేవ్ రానుందా అంటే వైద్యుల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. గతకొంతకాలంగా భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొన్నటివరకు వెయ్యికి లోపు నమోదు అయిన కేసులు తాజాగా మూడువేలకుపైగా చేరాయి. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా రెట్టింపు అయ్యింది. దీంతో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచిస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఆంక్షలను కఠిన తరం చేశాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా విస్తృతి క్రమేపి పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 3.27 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా..3 వేల 205 కేసులు నమోదైయ్యాయి. ఇందులో సగం కేసులు ఢిల్లీ నుంచే ఉన్నాయి. అక్కడ గతకొంతకాలంగా కోవిడ్ కేసులు రెట్టింపు అవుతున్నాయి. ముందురోజు కంటే 32 శాతం కేసులు అధికంగా నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు సైతం 5.97 శాతానికి చేరింది. దీంతో కేజ్రీవాల్ సర్కార్ అలర్ట్ అయ్యింది. కరోనా పరీక్షలను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. 


భారత్‌లో తాజాగా కరోనా నుంచి కోలుకుని 2 వేల 802 మంది డిశ్చార్జ్ అయ్యాయి. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 98.74 శాతంగా ఉందని అధికారులు తెలిపారు. కొత్త కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య 19 వేల 509కి చేరింది. మొత్తం కోవిడ్ కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య వాటా 0.05 శాతంగా ఉంది. 24 గంటల్లో మహమ్మారి వల్ల 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 5 లక్షల 23 వేల 920 మంది మృతి చెందారు. 


క్రమంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రాలన్నీ అప్రమత్తమైయ్యాయి. ఏపీ, తెలంగాణలో మాస్క్‌ను తప్పనిసరి చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. కరోనా వ్యాప్తి కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు దేశంలో కరోనా పరీక్షలు వేగవంతం అయ్యాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని  ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.


దేశంలో టీకా ఉద్యమం కొనసాగుతోంది. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. తాజాగా 4 లక్షల 79 వేల 208 మందికి టీకా అందించారు. దీంతో ఇప్పటివరకు 189 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించారు. దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం చెబుతోంది. 


Also read:Yadadri Temple: యాదాద్రి కొండపై ఘాట్‌ రోడ్డు అందుకే కుంగిందా..?


Also read:Livingstone Six: బాప్‌రే.. ఐపీఎల్‌ చరిత్రలోనే రెండో భారీ సిక్సర్‌! లివింగ్‌స్టోన్ బ్యాట్ చెక్ చేసిన రషీద్ ఖాన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook