GATE 2021 exams: గేట్ 2021 ఎగ్జామ్స్ షెడ్యూల్, అర్హతల సడలింపు వివరాలు
GATE 2021 exams dates: గేట్ 2021 ఎగ్జామ్స్ కోసం తాజాగా పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించిన బాంబే ఐఐటి.. ఈసారి కరోనావైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికంటే దీర్ఘకాలం పాటు పరీక్షలను నిర్వహించే విధంగా పరీక్షల తేదీలను ఖరారు చేసినట్టు వెల్లడించింది.
GATE 2021 exams dates: గేట్ 2021 ఎగ్జామ్స్ కోసం తాజాగా పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించిన బాంబే ఐఐటి.. ఈసారి కరోనావైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికంటే దీర్ఘకాలం పాటు పరీక్షలను నిర్వహించే విధంగా పరీక్షల తేదీలను ఖరారు చేసినట్టు వెల్లడించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 14వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. IIT Bombay ప్రకటించిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 5, 6, 7, 12, 13, 14 తేదీల్లో గేట్ 2021 పరీక్షలు నిర్వహించనున్నారు.
Also read: Time capsule: రామ మందిరం కింద 2 వేల అడుగుల లోతులో టైమ్ క్యాప్సుల్
GATE 2021 exams schedule పొడిగించడంతో పాటు గేట్ 2021 పరీక్షలకు ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేలా అర్హతల విషయంలో ఉన్న పలు నిబంధనలను సడలించడం, కొత్తగా మరో రెండు సబ్జెక్టులు చేర్చడం వంటి మార్పుచేర్పులు చేపట్టారు. కొత్తగా సడలించిన నిబంధనల ప్రకారం 10+2+4 విద్యార్హత అనే కనీస నిబంధనను 10+2+3 కి కుదించారు. అంటే 2021 గేట్ పరీక్షలకు థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నమాట. అలాగే హ్యూమనిటీస్ బ్యాగ్రౌండ్ ( Humanities background ) వారిని కూడా గేట్ 2021కి అనుమతించనున్నట్టు ఐఐటి-బాంబే పేర్కొంది.
Also read: Corona Cases: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
కొత్తగా ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, హ్యూమనిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ సబ్జెక్టులు చేర్చారు. దీంతో గేట్ 2021 పరీక్ష సబ్జెక్టుల సంఖ్య మొత్తం 27కి చేరింది. Also read: Madras IIT: ఆ బ్యాండ్ ధరిస్తే చాలు..కరోనా ఉందో లేదో తెలుస్తుంది