న్యూ ఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ( Delhi CM Arvind Kejriwal ) బీజేపి ఎంపీ గౌతం గంభీర్ ఘాటు ( BJP MP Gautam Gambhir ) వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో భారీ వర్షాలు కురవడంతో అనేక ప్రాంతాలు చెరువులను తలపించేలా వరద నీటితో నిండిపోయాయి. ఇంకొన్నిచోట్ల నీరు జనావాసాల్లోకి ప్రవేశించాయి. ఈ నేపథ్యంలో నీట మునిగిన ఓ ప్రాంతాన్ని ఖాళీ చేసేందుకని కొంతమంది ఒంటెద్దు బండి ఎక్కి వెళ్తుండగా అది మధ్యలోనే కుదిపేయడంతో అందులో ఉన్నవాళ్లు కింద నీటిలో పడిపోయారు. ఇదే దృశ్యాన్ని ట్విటర్‌లో షేర్ చేసుకున్న గౌతం గంభీర్.. అరవింద్ కేజ్రీవాల్‌ని 21వ శతాబ్ధపు తుగ్లక్‌గా అభివర్ణిస్తూ ఆ వీడియోపై ఓ క్యాప్షన్ పెట్టారు. ఇది 14వ శతాబ్ధపు తుగ్లక్ పాలిస్తున్న ఢిల్లీ కాదని.. 21వ శతాబ్ధపు తుగ్లక్ పాలిస్తున్న ఢిల్లీ అని గౌతం గంభీర్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. Also read: Pranab Mukherjee: ప్రణబ్ ముఖర్జీ బతికే ఉన్నారు: అభిజీత్ ముఖర్జీ



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు ( Delhi rain ) ఢిల్లీలో అనేక చోట్ల వరదలు ఉప్పొంగుతున్నాయి. రోడ్లు సైతం చెరువులను తలపిస్తుండటంతో చాలా చోట్ల వాహనాలు వరద నీటిలో చిక్కుకుపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. Also read: Ayyapanum Koshiyum: మరో రీమేక్ సినిమాలో పవన్ కల్యాణ్ ?