Goa election result 2022: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ కొనసాగుతోంది. ఒక్క పంజాబ్​లో మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆధిపత్యం సొగిస్తున్నట్లు ప్రస్తుత ట్రెండ్స్​ ద్వారా తెలుస్తోంది. మ్యాజిక్​ ఫిగర్​ను దాటి ఆధిపత్యం దిశగా ట్రెండ్ నడుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గోవాలో మళ్లీ అధికారం..


గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో 21 సీట్లు వస్తే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాం ఉంటుంది. అయితే గోవాలే ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ వచ్చేలా కనిపించడం లేదు. ఎగ్జిట్ పోల్స్​ సర్వేలో చెప్పినట్లు గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు పోత్తు తప్పేలా లేదు.


ప్రస్తుత ట్రెండ్ చూస్తే గోవాలో 18 స్థానాల్లో బీజేపీ లీడ్​లో ఉంది. కాంగ్రెస్ 11 స్థానాల్లో లీడ్​లో కొనసాగుతోంది.


ఎంజీపీ 4 స్థానాల్లో లీడ్​లో ఉంది. ఆప్​ 2, జీఎఫ్​పీ 1 స్థానంలో లీడ్​లో కొనసాగుతున్నాయి. ఇతరులు 4 స్థానాల్లో లీడ్​లో ఉన్నారు. ఈ ట్రెండ్స్​ను చూస్తే గోవాలో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో ఎంజీపీ కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయని చెబుతున్నారు విశ్లేషకులు.


బీజేపీ మళ్లీ అధికారం చేపట్టాలంటే కచ్చితంగా ఇతరులతో పొత్త పెట్టుకోక తప్పదని అంచనాలు వస్తున్నాయి. మరి కౌంటింగ్ తుది దశకు చేరుకునే సమయానికి ఎలాంటి ఫలితాలు వెడువడుతాయి. పొత్తు గురించి ఎలాంటి ప్రకటన రావచ్చు? అనే విషయాలు మరికాసేపట్లో తెలిసే అవకాశాలున్నాయి.


Also read: Punjab Election Result 2022: పంజాబ్‌లో అద్భుతం.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకుపోతున్న ఆప్!!


Also read: Uttar pradesh: ఉత్తరప్రదేశ్‌లో దూసుకుపోతున్న బీజేపీ, రెండవసారి ముఖ్యమంత్రిగా యోగీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook