Punjab Election Result 2022: పంజాబ్‌లో అద్భుతం.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకుపోతున్న ఆప్!!

Punjab Assembly Election Results, AAP in Lead. పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌లు 2022లో ఆమ్ ఆద్మీ పార్టీ సంచ‌ల‌నం సృష్టించింది. ఈరోజు జ‌రుగుతున్న కౌంటింగ్‌లో లీడింగ్‌లో కొన‌సాగుతోంది. అంతేకాదు ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకుపోతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 10, 2022, 11:42 AM IST
  • పంజాబ్‌లో అద్భుతం
  • హామీలకు ప్రజలు ఫిదా
  • ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకుపోతున్న ఆప్
Punjab Election Result 2022: పంజాబ్‌లో అద్భుతం.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకుపోతున్న ఆప్!!

Punjab Assembly Election Results 2022,  AAP set for 1st win outside Delhi: పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌లు 2022లో ఆమ్ ఆద్మీ పార్టీ సంచ‌ల‌నం సృష్టించింది. ఈరోజు జ‌రుగుతున్న కౌంటింగ్‌లో లీడింగ్‌లో కొన‌సాగుతోంది. అంతేకాదు ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకుపోతోంది. మ్యాజిక్‌ ఫిగర్‌ 59 కంటే ఎక్కువ స్థానాల్లో ప్రస్తుతం ఆప్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆప్ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్ కేజ్రీవాల్‌ ప్రకటించిన మ్యానిఫెస్టోకు, హామీలకు ప్రజలు ఫిదా అయ్యారని స్పష్టంగా తెలుస్తోంది. 'ఎక్ మౌకా కేజ్రీవాల్.. ఎక్ మౌకా భగవంత్ మన్' బాగా వర్కవుట్ అయింది. ఇక్కడ అధికార కాంగ్రెస్​ ప్రభావం చూపలేక చతికిలపడిపోయింది.

పంజాబ్‌లో 117 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 59. ఈరోజు జరుగుతున్న ఓట్ల లెక్కింపులో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ ఆ ఫిగర్‌ను దాటేసింది. ఇక పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం ఏర్పడడం దాదాపు ఖాయం అయింది. దాంతో ఆప్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు సీఎం అభ్యర్థి భగవంత్‌ మాన్‌.. ధురిలో గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. దాంతో ఆప్‌ శ్రేణుల్లో పండుగ వాతావరణం నెలకొంది.

పంజాబ్‌ రాష్ట్రంలో హేమాహేమీలు దారుణంగా విఫ‌ల‌మైన‌ట్లు రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. లంబీ స్థానం నుంచి పోటీ చేసిన ప్ర‌కాశ్ సింగ్ బాద‌ల్ వెనుకంజ‌లో ఉన్నారు. పాటియాలా అర్బ‌న్ నుంచి పోటీ చేసిన పంజాబ్ మాజీ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ కూడా వెనుకంజ‌లో ఉన్నారు. ఇక శిరోమ‌నీ అకాలీద‌ళ్ నేత గ‌నివీ కౌర్ మంజిత మాత్రం లీడింగ్‌లో ఉన్నారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో పంజాబ్‌ రిజల్ట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఢిల్లీ బయట ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారిగా విజయం సాదించనుంది. ఆప్ అన్ని పార్టీలకు భారీ షాక్‌ ఇచ్చింది. అధికార కాంగ్రెస్‌ తన ప్రభావం ఏమాత్రం చూపలేకపోయింది. ప్రాంతీయ ఆదరణ ఉన్న శిరోమణి అకాళీ దళ్‌, జాతీయ పార్టీ బీజేపీల పప్పులు ఆప్‌ ముందు ఉడకలేదు. మొత్తానికి అరవింద్ కేజ్రీవాల్‌ ప్రభావం పంజాబ్‌లో భారీగానే చూపింది. 

Also Read: NZW vs INDW: చెలరేగిన న్యూజిలాండ్‌ బ్యాటర్‌లు.. భారత్‌ లక్ష్యం 261!!

Also Read: Indian Railways: ఒకటి, రెండు కాదు ఏకంగా పూర్తిగా రైలునే బుక్ చేసుకోవచ్చు.. అదెలాగంటారా.. ??

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News