Golden masks, silver masks: కోయంబత్తూరు: గోల్డెన్ మాస్కులు, సిల్వర్ మాస్కులా !! అదేంటి మాస్క్ అంటే కేవలం వైరస్ నుంచి రక్షణ కోసం ముక్కు, మూతికి అడ్డంగా పెట్టుకునే వస్త్రం మాత్రమే కదా !! ఇంక ఇందులోనూ గోల్డెన్ మాస్కులు, సిల్వర్ మాస్కులు ఉంటాయా ఏంటి అని అనుకుంటున్నారా ? అయితే, అవి ఎక్కడ లభిస్తాయి, ఏంటనే విషయం తెలియాలంటే తమిళనాడులోని ( Tamilnadu ) కోయంబత్తూరులో  ఉన్న ఆర్కే జువెల్ వర్క్స్ స్టోర్ గురించి తెలుసుకోవాల్సిందే. అవును కోయంబత్తూరులో ( Coimbatore ) తయారవుతున్న బంగారం మాస్క్, వెండి మాస్కులకు ఇప్పుడు అక్కడ భారీ డిమాండ్ ఏర్పడింది. ( Also read: Credit Card Benefits: క్రెడిట్ కార్డు వల్ల లాభాలివే )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మాస్కుని మాస్కులాగే ధరించకుండా దానిని కూడా ఓ ఫ్యాన్సీ మాస్కులు ( Fancy masks ) తరహాలో ధరించొచ్చు కదా అంటున్న ఆ స్టోర్ యజమాని రాధాకృష్ణన్ సుందరం ఆచార్య.. తర్వాత ఈ గోల్డెన్ మాస్కులు, సిల్వర్ మాస్కులను కరిగించుకుంటే.. వాటినే మళ్లీ నచ్చిన డిజైన్లలో ఆభరణాలు ( Jewellery designs ) చేయించుకునే వీలు కూడా ఉందని సలహా ఇస్తున్నాడు. ( EMI REFUND : కట్ అయిన EMI తిరిగి రావాలంటే ఇలా చేయండి )


కంసాలి వృత్తిలో ( Golden smith ) 35 ఏళ్ల అనుభవం ఉన్న రాధాకృష్ణన్.. బంగారం, వెండితోనూ వస్త్రాలు ( Golden clothes ) రూపొందించడంలో పట్టు సంపాదించాడు. దేవతా మూర్తులకు కానుకగా సమర్పించడానికి, చిన్న పిల్లలకు పుట్టిన రోజు లాంటి ప్రత్యేక సందర్భాల్లో వస్త్రధారణ ( Birthday fashion ) కోసం బంగారం, వెండితో వస్త్రాలు రూపొందించాల్సిందిగా రాధాకృష్ణన్‌కి ఆర్డర్స్ వస్తుండేవి. అదే అనుభవంతో ప్రస్తుతం మాస్కులు ధరించే సీజన్ కావడంతో ఆయన దృష్టి గోల్డెన్ మాస్క్, సిల్వర్ మాస్కులపై పడింది. ఇంకేం.. బంగారం మాస్కులు, వెండి మాస్కులు రూపొందించడం అమ్మడం మొదలుపెట్టాడు. ధనవంతుల ( Rich people ) నుంచి వాటికి ఆధరణ లభించింది. తాను తయారు చేస్తోన్న మాస్కులకు డిమాండ్ ఏర్పడంతో ఇప్పుడు వాటిని మరింత అందంగా తయారు చేయడం మొదలుపెట్టాడు. ( Also read: Gmail new design: జీమెయిల్ ఇక ముందులా ఉండదు )


ధర ఎంతో తెలుసా ?
బంగారం మాస్కుల తయారీకి 50 గ్రాముల బంగారం, వెండి మాస్కులకు 50 గ్రాముల వెండి అవసరం అవుతుంది. ఇవే కాకుండా మరో 6 గ్రాముల వస్ర్తం అవుతుంది. గోల్డ్ మాస్క్ ఖరీదు రూ. 7 లక్షల 75 వేలు కాగా వెండి మాస్కు ధర రూ.15,000 అవుతుంది అంటున్నాడు రాధాకృష్ణన్. 


Also read: Bamboo Bottles: బొంగులో బాటిల్‌కు పెరుగుతున్న డిమాండ్