బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) మళ్లీ పెరిగాయి. గత వారం తగ్గిన ధరలు తాజాగా పుంజుకుంటున్నాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనించి భారీగా ధర పెరిగింది. హైదరాబాద్‌ (Gold Price Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.490 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,530 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,160కి ఎగసింది. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు (Gold Rate in Delhi) భారీగా పెరిగాయి. తాజాగా రూ.610 మేర పసిడి ధర పుంజుకుంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,350 అయింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.550 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.48,900కి పెరిగింది. 



బులియన్ మార్కెట్‌లో గత వారం భారీగా దిగొచ్చిన వెండి ధర (Silver Rate in India) తాజాగా పుంజుకుంటోంది. తాజా వెండి ధర రూ.2700 చొప్పున భారీగా పెరిగింది. దీంతో వెండి ధర మరోసారి రూ.60 వేల మార్క్ దాటింది. ప్రస్తుతతం 1 కేజీ వెండి ధర రూ.60,700కి పెరిగింది. దేశ వ్యాప్తంగా ఇదే ధర వద్ద వెండి ట్రేడ్ అవుతుంది. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe