Aircraft Engine Repairs ఇక నుండి హైదరాబాద్ లోనే విమానాల ఇంజన్ రిపేర్లు
దినాభివృద్ది చెందుతున్న హైదరాబాద్ విశ్వ నగరంగా మారుతుంది. గూగుల్ మొదలుకుని చిన్న చిన్న సాఫ్ట్ వేర్ కంపెనీల వరకు వందలు కాదు వేలకు వేలు హైదరాబాద్ లో ఉన్నాయి. ఇపుడు కొత్తగా విమానాల ఇంజన్ రిపేర్లు చేసే ఇండస్ట్రీ కూడా హైదరాబాద్ లో పారంభం కానుంది.
Aircraft engine repairs in Hyderabad: అంతర్జాతీయ స్థాయి నగరాల్లో హైదరాబాద్ నగరం ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. విశ్వ నగరంగా హైదరాబాద్ దిన దినాభివృద్ది జరుగుతూనే ఉంది. ప్రభుత్వం ఇస్తున్న మద్దతు తో పాటు హైదరాబాద్ లో ఉన్న మౌళిక వసతులు.. జనాభా పెరుగుదల ఇలా ఎన్నో కారణాల వల్ల అంతర్జాతీయ స్థాయి సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.
గూగుల్ మొదలుకుని చిన్న చిన్న సాఫ్ట్ వేర్ కంపెనీల వరకు వందలు కాదు వేలకు వేలు హైదరాబాద్ లో ఉన్నాయి. కేవలం సాఫ్ట్ వేర్ కంపెనీలు మాత్రమే కాకుండా అద్భుతమైన ఫార్మా కంపెనీలు ఇంకా ఎన్నో రకాల ఈకామర్స్ సంస్థలు అంతర్జాతీయ రీటైల్ వ్యాపార సంస్థలు హైదరాబాద్ లో తమ వాణిజ్యంను నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఇంతటి ఘన కీర్తిని సొంతం చేసుకున్న హైదరాబాద్ కి మరో అరుదైన ఘనత దక్కబోతుంది.
దేశీయ విమానాలతో పాటు అంతర్జాతీయ విమానాలు ఏమైనా టెక్నికల్ సమస్యలు వచ్చినప్పుడు... ఇంజిన్ రిపేర్ వచ్చినప్పుడు హైదరాబాద్ లో కాకుండా ఇతర ప్రాంతాలకు రిపేర్ కోసం వెళ్లాల్సి ఉండేది.
హైదరాబాద్ నుండి ఇతర ప్రాంతాలకు విమానాలు తీసుకు వెళ్లడం లేదంటే ఇంజన్ వరకు తీసుకు వెళ్లడం అనేది పెద్ద తలనొప్పిగా ఉండేది. కానీ ఇకపై ఆ సమస్య లేదు.
ఎలాంటి విమానం అయినా హైదరాబాద్ లోనే రిపేర్ చేసే విధంగా శాఫ్రాన్ ఎంఆర్‌వో యూనిట్ లో రిపేర్ చేసే అవకాశాలు ఉన్నాయి. జీఎంఆర్ గ్రూప్ సంస్థ హైదరాబాద్ ఏవియేషన్ ఎస్ఈజడ్ లిమిటెడ్ వారు శాఫ్రాన్ సంస్థ తో ఒప్పిందం చేసుకుని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పక్కనే అతి పెద్ద యూనిట్ ను ఏర్పాటు చేయబోతున్నారు. 23.5 ఎకరాల భూమి ని శాఫ్రాన్ కంపెనీకి లీజుకు ఇస్తున్నట్లుగా జీఎంఆర్ గ్రూప్ అధికారికంగా ప్రకటించింది.
Also Read: Tata Motors Cars on Discount: టాటా కార్లపై రూ. 50,000 డిస్కౌంట్ ఆఫర్స్
శాఫ్రాన్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా అనేక యూనిట్ లను కలిగి ఉంది. ఇప్పటికే జీఎంఆర్ తో కలిసి కేబుల్ హార్నెసింగ్.. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ విడిబాగాల తయారు చేసే యూనిట్లను నిర్వహిస్తోంది. ఇప్పుడు విమాన ఇంజన్ రిపేర్ కు సంబంధించిన యూనిట్ ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రత్యక్షంగా వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. పరోక్షంగా 2500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంటున్నారు.
మొదటి ఏడాది లో 100 ఇంజిన్లకు సర్వీస్ చేయగల సామర్థ్యంతో యూనిట్ ను ఏర్పాటు చేస్తున్నట్లుగా కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. భారత్ లో తమ సంస్థ ను విస్తరించడం చాలా సంతోషంగా ఉందని.. జీఎంఆర్ తో కలిసి పని చేయడం కోసం ముందు ముందు మరిన్ని యూనిట్ లను ఏర్పాటు చేసే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా శాఫ్రాన్ ఎయిర్ క్రాప్ట్ సంస్థ ముఖ్య అధికారి నికోలస్ పోటియర్ పేర్కొన్నారు. ఈ సర్వీస్ యూనిట్ వల్ల హైదరాబాద్ ప్రపంచ పటంలో మరింతగా వెలగడం ఖాయం.
Also Read: Bigg Boss 7: బిగ్‌బాస్ హౌస్‌లోకి టీమిండియా మాజీ క్రికెటర్.. ఎవరో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి