TCS Hiring: కరోనా బ్యాచ్ ఎంబీఏలకు శుభవార్త, టీసీఎస్‌లో భారీగా ఉద్యోగాలు
TCS Hiring: కరోనా మహమ్మారి విద్యార్ధుల కెరీర్‌ను నాశనం చేసింది. ఆన్‌లైన్ క్లాసులు, పరీక్షలు జరగకపోవడం వంటివి విద్యార్ధుల భవిష్యత్‌ను ప్రశ్నార్ధకం చేశాయి. అదే సమయంలో ఆ విద్యార్ధులకు టీసీఎస్ సంస్థ శుభవార్త విన్పించింది.
TCS Hiring: కరోనా మహమ్మారి విద్యార్ధుల కెరీర్‌ను నాశనం చేసింది. ఆన్‌లైన్ క్లాసులు, పరీక్షలు జరగకపోవడం వంటివి విద్యార్ధుల భవిష్యత్‌ను ప్రశ్నార్ధకం చేశాయి. అదే సమయంలో ఆ విద్యార్ధులకు టీసీఎస్ సంస్థ శుభవార్త విన్పించింది.
కరోనా మహమ్మారి(Corona Pandemic)కారణంగా దేశమంతా విద్యాసంస్థలు మూతపడ్డాయి. రెగ్యులర్ క్లాసులు లేక ఆన్‌లైన్ క్లాసులే దిక్కయ్యాయి. జూమ్ లేదా గూగుల్ మీట్ ద్వారా విద్యార్ధులు పాఠాలు వినాల్సిన పరిస్థితి. ఇక ప్రాక్టికల్ తరగతులకైతే అవకాశమే లేదు. కోవిడ్ కారణంగా చాలా కోర్సులకు సంబంధించి సిలబస్ పూర్తి కాలేదు. సిలబస్ పూర్తి అనిపించుకున్న సబ్జెక్టులు, చాప్టర్లు కూడా అరకొరగానే జరిగాయనే అభిప్రాయం తల్లిదండ్రుల్లో, విద్యార్థుల్లో ఉంది. మరికొన్ని కోర్సులకు, క్లాసులకు ఎటువంటి పరీక్షలు లేకుండానే ప్రమోట్ అయ్యారు. దీంతో 2019-20,2020-21,2021-22 బ్యాచ్‌లకు కరోనా బ్యాచ్‌లుగా ముద్ర పడింది. భవిష్యత్తులో సాధారణ బ్యాచ్‌లతో పోల్చితే కరోనా బ్యాచ్‌ల(Corona Batches)పరిస్థితి ఏంటనే ఆందోళన చాలామందిలో నెలకొంది.
ఈ నేపధ్యంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ(TCS) ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్ చెబుతోంది. ఫ్రెష్ ఎంబీఏ గ్రాడ్యుయేట్లపై వరం కురిపించింది. కరోనా కష్టకాలంలో కోర్సు పూర్తి చేసిన విద్యార్ధులకు అవకాశం కల్పిస్తోంది. కరోనా బ్యాచ్ సామర్ధ్యంపై నెలకొన్న సందేహాల్ని పక్కనబెడుతూ..టీసీఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంబీఏ హైరింగ్ ప్రోగ్రామ్(MBA Hiring Program)కింద ఎంబీఏ విద్యార్ధుల్ని ఉద్యోగాల్లో తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2019-20, 2020-21, 2021-22 బ్యాచ్‌లలో పాసవుట్ అయిన ఎంబీఏ గ్రాడ్యుయేట్స్‌కి అవకాశం కేటాయించింది. ఉద్యోగార్ధులు టీసీఎస్ పోర్టల్ ద్వారా ఎంబీఏ హైరింగ్‌లో భాగం కావచ్చు. నవంబర్ 9వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముంది. 18-28 ఏళ్ల వయస్సు పరిమితి ఉంటుంది. ఉద్యోగార్ధులు రెండేళ్ల ఎంబీఏ కోర్సును పూర్తి చేయడమే కాకుండా పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో 60 శాతం మార్కులతో పాస్ కావల్సి ఉంటుంది. బీటెక్ బ్యాక్‌గ్రౌండ్‌తో ఎంబీఏ పూర్తి చేసుండాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధుల స్క్రీనింగ్ కోసం 90 నిమిషాల పరీక్ష ఉంటుంది. వెర్బల్ ఆప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, బిజినెస్ ఆప్టిట్యూడ్ విభాగాల్లో ప్రశ్నలుంటాయి. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా 35 వేలమందిని టీసీఎస్ హైర్ చేసుకోనుంది.
Also read: T20 World Cup Records: టీ20 ప్రపంచకప్ ప్రత్యేకతలు, రికార్డుల వివరాలు ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook