SBI home loan offers: ముంబై: ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఎస్బీఐ బ్యాంకు గుడ్ న్యూస్ ( SBI bank good news ) చెప్పింది. కరోనా సంక్షోభంలోనూ సొంతంగా ఇల్లు కొనుగోలు చేయాలనుకునేవారి సొంతింటి కల నిజం చేసేందుకు గృహ రుణాల వడ్డీ రేటుపై ప్రత్యేక ఆఫర్లను ( special offers on home loans ) ప్రకటించింది. Also read : Kattappa in Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ హౌజ్‌లో వీళ్లలో కట్టప్ప ఎవరు ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి గృహ రుణాలు పొందడం కోసం దరఖాస్తు చేసుకునే వారికి ప్రాసెసింగ్ ఫీజు రద్దు చేయడంతో పాటు రూ. 30 లక్షలకు పైబడి, కోటి రూపాయల కంటే తక్కువ రుణాలపై సిబిల్ స్కోరు మెరుగ్గా ఉన్న రుణగ్రహీతలకు 0.10శాతం వడ్డీ రాయితీ ఇవ్వనున్నట్టు ఎస్బీఐ వెల్లడించింది. అంతేకాకుండా ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి అదనంగా మరో 0.5 శాతం రాయితీ అందించనున్నట్టు ఎస్బీఐ తెలిపింది. ఎస్బీఐ వెల్లడించిన వివరాల ప్రకారం ఒక్క ప్రాసెసింగ్ ఫీజు రద్దుతోనే రుణగ్రహీతలకు రుణంగా పొందే మొత్తంలో 0.40% ఆదా కానుంది. Also read : Revanth Reddy's open letter: సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖతో రేవంత్ రెడ్డి హెచ్చరిక

SBI home loans విషయానికొస్తే.. ప్రస్తుతం వేతన జీవులకు ( Salaried employees ) గృహ రుణాలపై 6.95 శాతం నుండి 7.45 శాతం వరకు వడ్డీ రేటు చార్జ్ చేస్తున్న ఎస్బీఐ.. స్వయం ఉపాధి పొందుతున్నవారికి ( Self employed ఇచ్చే రుణాలపై 7.10 శాతం నుండి 7.60 శాతం మధ్య వడ్డీ రేటు వసూలు చేస్తోంది. ఐతే కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి కారణంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు రెపో రేటును ( Repo rate ) 4 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో గృహ రుణాలపై వడ్డీ రేట్లు పదేళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఒక రకంగా సొంత ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది నిజంగానే గుడ్ న్యూస్ కానుంది. Also read : Gangavva funny dialogues: బిగ్ బాస్ హౌజ్‌లో గంగవ్వ చెప్పే ఫన్నీ డైలాగ్స్ వింటే కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే