కోవిడ్ ( Covid19 ) నేపధ్యంలో ఐఐటీ ( IIT ), ఎన్ఐటీ ( NIT ) విద్యార్ధులకు ఓ గుడ్ న్యూస్. జాతీయ విద్యాసంస్థల్లో అడ్మిషన్లకు సంబంధించిన నిబంధనల్లో కేంద్రం సడలింపు ఇచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఐఐటీ, ఎన్ఐటీ వంటి జాతీయ సంస్థల అడ్మిషన్ల ( Relaxation in IIT, NIT admissions ) లో నిబంధనల్నించి ఈసారి విద్యార్ధులకు మినహాయింపు లభిస్తోంది. వాస్తవానికి ఈ సంస్థల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ పరీక్షల్లో అర్హత ఒక్కటే సరిపోదు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ( 75 percent marks in Intermediate ) 75 శాతం మార్కులు లేదా జేఈఈ ( JEE ) టాప్ 20 పర్సంట్ సాధించాల్సి ఉంది. కోవిడ్ నేపద్యంలో కేంద్ర ప్రభుత్వం ( Central Government ) ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది. కరోనా సంక్రమణ ( Corona virus spread ) నేపధ్యంలో చాలా రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ సవ్యంగా జరగలేదు. అటు విద్యార్ధులు సైతం కోవిడ్ బారిన పడ్డారు. దీంతో ఇంటర్మీడియట్ లో 75 శాతం మార్కుల నిబంధన నుంచి మినహాయింపు  ఇచ్చారు. కేవలం జేఈఈలో అర్హత సాధించిన మెరిట్‌ అభ్యర్థులకు సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. 


మరోవైపు కోవిడ్‌ కారణంగా అభ్యర్థులు ఆయా సంస్థల్లో చేరేందుకు ఆన్‌లైన్‌లో రిపోర్టింగ్‌ చేయవచ్చు. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు మాత్రం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. జేఈఈ అడ్వాన్స్‌ పరీక్ష 27న జరగనున్న నేపథ్యంలో ఐఐటీ న్యూఢిల్లీ సోమవారం నుంచి అడ్మిట్‌ కార్డులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ ఏడాది మొత్తం 2 లక్షల .50 వేల మంది అర్హత సాధించినా కేవలం 1 లక్షా 60 వేల 864 మందే పరీక్షకు హాజరయ్యేందుకు నమోదు చేసుకున్నారు. జేఈఈ ఫలితాలు ( JEE Results ) అక్టోబర్ 5న వెలువడుతాయి. అక్టోబర్ 6 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈసారి కౌన్సెలింగ్‌ ప్రక్రియను కేవలం 6 విడతల్లోనే ముగిస్తారు.


జేఈఈ అడ్వాన్స్ ర్యాంక్ ఆధారంగా ఐఐటీలతో పాటు బెంగుళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్, బర్హంపూర్, భోపాల్, కోల్‌కతా, మొహాలి, పూనే, తిరువనంతపురం, తిరుపతిలలో ఉన్న ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరోవైపు తిరువనంతపురంలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, రాయబరేలీలోని రాజీవ్‌ గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం టెక్నాలజీ, విశాఖలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం సంస్థలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. Also read: Atomic power plant: కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు