Atomic power plant: కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ లో అణు విద్యుత్ కేంద్రం రాబోతోంది. సాక్షాత్తూ కేంద్రం ఈ ప్రకటన చేసింది. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ లో ఈ ప్రాజెక్టు నిర్మించనున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది.

Last Updated : Sep 22, 2020, 01:51 PM IST
Atomic power plant: కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో అణు విద్యుత్ కేంద్రం ( Atomic power plant ) రాబోతోంది. సాక్షాత్తూ కేంద్రం ఈ ప్రకటన చేసింది. శ్రీకాకుళం జిల్లా ( Srikakulam District ) కొవ్వాడ ( Kovvada ) లో ఈ ప్రాజెక్టు నిర్మించనున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది.

ఏపీలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయనున్న కేంద్ర ప్రభుత్వం ( Central Government announcement ) స్పష్టమైన ప్రకటన చేసింది. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు సూచించిన అర్హతల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ ప్రాంతంలో ఈ అణు విద్యుత్ కేంద్రం నిర్మించనున్నారు. దీని కోసం అమెరికాకు చెందిన వెస్టింగ్ హౌజ్ ఎలక్ట్రిక్ కంపెనీ ( Westinghouse Electric company ) తో చర్చలు జరుగుతున్నాయి. 1208 మెగావాట్ల సామర్ధ్యం  కలిగిన 6 అణు రియాక్టర్లను ఈ కేంద్రంలో ఏర్పాటు చేయనున్నారు. కొవ్వాడ ప్రాంతం ఎంపిక వెనుక అన్నిరకాల అధ్యయనాలున్నాయని కేంద్రం తెలిపింది. Also read: MPs suspension: సమావేశాలను బహిష్కరించిన విపక్ష పార్టీలు

Trending News