covid-19 face masks fine: న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మరణాలు కూడా అదే స్థాయిలో సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో కోవిడ్ -19 నివారణలో భాగంగా.. గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాల నేపథ్యంలో.. గుజరాత్ ప్రభుత్వం ( Gujarat Govt ) బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుండా తిరుగుతున్న వ్యక్తులకు గుణపాఠం చెప్పేవిధంగా.. ప్రస్తుత రూ .500 జరిమానాను వేయి రూపాయలకు పెంచింది. Also read: Rave Party: డిల్లీ లో రేవ్ పార్టీ.. పోలీసుల రైడ్..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేకుండా తిరుగుతున్న వారి దగ్గర నుంచి కనీసం వేయి రూపాయల జరిమానా వసూలు చేయాలని గుజరాత్ హైకోర్టు గత నెలలో ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, ఈ క్రమంలో కరోనా నుంచి రక్షణకు మాస్కులు కీలకమైనవని.. కావున చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. హైకోర్టు ఆదేశాలను అనుసరిస్తూ.. బహిరంగంగా మాస్క్ ధరించనందుకు దీని జరిమానాను పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ( Vijay Rupani ) పేర్కొన్నారు. ఈ జరిమానా ఆగస్టు 11 నుంచి రాష్ట్రంలో అమలవుతుందని పేర్కొన్నారు. Also read: Covid-19: ఒక్కరోజే వేయికి పైగా కరోనా మరణాలు


అంతకుముందు గుజరాత్‌లో మాస్క్ ధరించనందుకు జరిమానా 200లు ఉండగా.. ఇటీవల దానిని ప్రభుత్వం 500లకు పెంచింది. మరలా దానిని వేయి రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. Also read: Donkey Milk: త్వరలో గాడిద పాల డెయిరీ ప్రారంభం