Donkey Milk Dairy: న్యూఢిల్లీ: భారత్ ( India ) లో పాల ఉత్పత్తి కోసం చాలా రకాల పాడి జంతువులను పెంచుతారు. వాటిలో ఆవు, గేదె, మేక ఉన్నాయి. మనకు ఎక్కువగా ఆవు, గేదె డెయిరీల ద్వారానే పాలు సరఫరా అవుతాయి. అయితే తొలిసారిగా దేశంలో గాడిద పాల డెయిరీని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దేశంలోని నేషనల్ హార్స్ రీసెర్చ్ సెంటర్ ( NRCE ) హిసార్‌లో గాడిద పాల డెయిరీ ( Donkey Milk Dairy ) ని ప్రారంభించడానికి ప్రణాళికలను రూపొందించింది. ఇందుకోసం ఎన్ఆర్సీఈ ఇప్పటికే 10 హలారి జాతి గాడిద (halari donkey) లకు ఆర్డర్ సైతం ఇచ్చింది. గాడిద పాలు రోగనిరోధక శక్తి పెంపొందించే వైద్యంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఎన్నోరకాల జబ్బులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. Also read: CM Shivraj: కరోనా బాధితులకు ప్లాస్మా దానం చేస్తా
గుజరాత్లో ప్రసిద్ధి చెందిన హలారి జాతికి చెందిన గాడిద పాలకు మంచి డిమాండ్ ఉంది. ఈ ఔషధాల పాలు లీటరుకు రెండు వేల నుంచి రూ. ఏడు వేల వరకు మార్కెట్లో అమ్ముడవుతుంది. ఇది క్యాన్సర్, ఊబకాయం, అలెర్జీ, ఉబ్బసం వంటి వ్యాధులపై పోరాడే రోగనిరోధక శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కావున దీని డెయిరీని ప్రారంభించేందుకు ఎన్ఆర్సీఈ హిసార్‌లోని సెంట్రల్ బఫెలో రీసెర్చ్ సెంటర్ (CIRB), కర్నల్‌లోని నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ( ICAR) శాస్త్రవేత్తల సహాయాన్ని కోరింది. గాడిదల బ్రీడింగ్ తర్వాత డెయిరీ పనులు మొదలవుతాయని జాతీయ గుర్రాల పరిశోధన కేంద్రం తెలిపింది. Also read: Kanimozhi: నీకు హిందీ రాదా? నువ్వు భారతీయురాలివేనా?
గాడిద పాలతో పిల్లలకు మేలు..
ఆవు, గేదె పాల ద్వారా పిల్లలకు అలెర్జీ వస్తుందని, కానీ హలారి జాతి పాల ద్వారా అలెర్జీ రాదని, ఈ పాలలో కొవ్వు కూడా నామమాత్రంగా ఉంటుందని ఎన్ఆర్సిఇ మాజీ డైరెక్టర్ డాక్టర్ ఎన్ఆర్ త్రిపాఠి పేర్కొన్నారు. ఇప్పటికే దీనిపై పరిశోధన చేసినట్లు వెల్లడించారు. అయితే.. గాడిద పాలతో సబ్బులు, లిప్‌బామ్, బాడీ లోషన్ లాంటి బ్యూటీ ఉత్పత్తులను ఇప్పటికే దేశంలో తయారు చేస్తున్నారు. Also read: Kerala Flight crash: ఆ రన్ వే సేఫ్ కాదని గతంలోనే హెచ్చరించారా