Gujarat Wall Collapse Tragedy: అహ్మెదాబాద్: గుజరాత్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మొర్బి జిల్లా హల్వాడ్‌లో ఉన్న గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఉప్పు ఫ్యాక్టరీలో గోడ కూలిన ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. ప్రస్తుతం అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఇంకెంతో మంది గోడ కూలిన చోట శిథిలాల కింద చిక్కుకుని ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాగర్ సాల్ట్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని గుజరాత్ రాష్ట్ర మంత్రి బ్రిజేష్ మెర్జా వెల్లడించినట్టు ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ స్పష్టంచేసింది. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే 90 శాతం సహాయ కార్యక్రమాలు పూర్తయ్యాయని, అయినప్పటికీ ప్రమాదానికి గల కారణం ఏంటో ఇంతవరకు తెలియరాలేదని మంత్రి బ్రిజేష్ మేర్జా తెలిపారు. పోలీసుల విచారణలోనే అన్ని విషయాలు వెలుగుచూస్తాయని బ్రిజేష్ అన్నారు. మృతుల కుటుంబాలకు త్వరలోనే ప్రభుత్వం తరపున నష్టపరిహారం ప్రకటిస్తామని మంత్రి బ్రిజేష్ పేర్కొన్నారు.


Also read : Gyanvapi Masjid Video: సంచలనం రేపుతున్న వీడియో.. జ్ఞానవాపి మసీదులో నంది విగ్రహం!


Also read : 2 Buses Collide in Salem district: సేలం జిల్లాలో రెండు బస్సుల ఢీ.. 40 మందికి గాయాలు (వీడియో)


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.