హెచ్ 1 బీ (H1B visa) వీసాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump)  తీసుకున్న నిర్ణయం ప్రభావం ప్రారంభమైపోయింది. అసలే కరోనా సంక్షోభ సమయంలో తప్పనిసరై మూటాముల్లే సర్దుకుని ఇండియాకు పయనం కడుతున్నారు. ప్రత్యేక విమానంలో ఆ కంపెనీ ఉద్యోగులు ఇండియాకు తిరిగొచ్చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అన్నుకున్నదే జరుగుతోంది. హెచ్ 1 బీ వీసాల ( H1B Visa effect) ప్రభావం కన్పిస్తోంది. అమెరికాలో ఉన్న భారతీయులపై ట్రంప్ పిడుగు ప్రభావం అది. వీసా రెన్యువల్ కు దరఖాస్తు అయితే చేసుకున్నారు కానీ ఎప్పుడు అవుతుందో తెలియదు. అసలు అవుతుందో లేదో తెలియదు. ఇంకొందరికి గడువు పూర్తయిపోయింది. మూటామల్లే సర్దుకుని సొంతగూటికి తిరిగొద్దామనుకుంటే విమాన సేవలు నిలిచిపోయున్నాయి. అమెరికాలో కష్టాలు పడుతున్న సంస్థ ఉద్యోగుల్ని ఆదుకునేందుకు ఇన్ ఫోసిస్ (Infosys) రంగంలో దిగింది. ప్రత్యేక విమానం ద్వారా 206 మందిని ఇండియాకు తిరిగి తీసుకొచ్చింది. ఖతార్ ఎయిర్ వేస్ ( Qatar Airways) కు చెందిన విమానంలో శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బెంగుళూరుకు వచ్చారు వీరంతా. హెచ్ 1 బీ, ఎల్ 1 వీసాలతో అమెరికాలోని కార్యాలయాల్లో పని చేస్తున్నవారికి వీసాలు రెన్యువల్ అవుతాయో లేదో సంశయం పట్టుకుంది. ఆ నేపధ్యంలోనే ఇండియాకు తిరిగి రావల్సి వచ్చింది. మరి కొంతమందిని కూడా త్వరలోనే రప్పించాలని ఇన్ ఫోసిస్ భావిస్తోంది. Also read: Tourism: పర్యాటక కేంద్రాలుగా లైట్ హౌస్‌ల అభివృద్ధి


భారత ఐటీ పరిశ్రమ ( Indian It industry) కు అమెరికా కీలకమైన మార్కెట్ గా ఉంది. ఇందులో 60 శాతం ఆదాయం ఈ ప్రాంతం  నుంచే వస్తుంది. ప్రాజెక్టులు అర్ధంతరంగా రద్దు కావడం, వీసాల గడువు పూర్తయిపోవడం వంటి కారణాల దృష్ట్యా చాలామంది అక్కడ ఇరుక్కుపోయారు. తాజాగా ట్రంప్ ప్రభుత్వం ( Trump Government) వర్క్ పర్మిట్లను కూడా రద్దు చేసింది. అయితే ఉద్యోగుల్ని వెనక్కి రప్పించడానికి కారణాన్ని ఇన్ఫోసిస్ అధికారికంగా ప్రకటించలేదు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..