Haj Yatra 2024 Registration: హజ్ యాత్రకు వెళ్లేవారికి అలర్ట్. వచ్చే ఏడాదిలో హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం మార్గదర్శకాలను విడుదల చేసింది హజ్ కమిటీ ఆఫ్ ఇండియా. హజ్‌కు వెళ్లే రెండేళ్లలోపు పిల్లలకు కూడా ఛార్జీలు వసూలు చేస్తామని కమిటీ తెలిపింది. రెండు సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల హజ్ ఖర్చులు పెద్దల ఖర్చుతో సమానంగా ఉంటాయని పేర్కొంది. రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు విమాన ఛార్జీలో 10 శాతం చెల్లించాలని తెలిపింది. 2024 సంవత్సరంలో హజ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 20 డిసెంబర్. www.hajcommittee.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. హజ్ కమిటీ ఆఫ్ ఇండియా మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. హజ్ కమిటీ చట్టం 2002 నిబంధనల ప్రకారం ఏర్పాటు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మన దేశం నుంచి హజ్ యాత్రికుల ప్రయాణాన్ని మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జెడ్డాలోని భారత కాన్సులేట్, రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం, సౌదీ అరేబియా దేశం, సౌదీ అరేబియాలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తాయి. 2024లో హజ్ యాత్రికుల నమోదు డిసెంబర్ 4వ తేదీన ప్రారంభమైంది. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 20వ తేదీతో ముగియనుంది. హజ్‌కు వెళ్లే వారి కోసం మొదటి విమానం జూన్ 14, 2024న బయలుదేరనుంది. చివరి విమానం జూన్ 19, 2024న బయలుదేరుతుంది. హజ్ యాత్రకు వెళ్లేందుకు కచ్చితంగా మెడికల్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది.


వీళ్లు హజ్ యాత్రకు వెళ్లేందుకు అనర్హులు


==> తీవ్రంగా గాయపడిన లేదా గర్భిణీలు హజ్ తీర్థయాత్రకు అర్హులు కాదు.
==> దరఖాస్తు చేసుకునేవారి వయసు 60 ఏళ్లకు మించకూడదు.
==> దరఖాస్తుదారు ముస్లిం కమ్యూనిటీకి చెందినవారై ఉండాలి.
==> దరఖాస్తుదారు శారీరక, మానసిక స్థితి ఆరోగ్యంగా ఉండాలి.
==> హజ్ 2024 రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను భారతీయ పౌరులు మాత్రమే నింపేందుకు అర్హులు.
==> అభ్యర్థులు కలిగి ఉన్న పాస్‌పోర్ట్ జనవరి 31, 2025 వరకు చెల్లుబాటులో ఉండాలి.


కాగా.. ఏడాది నుంచి సౌదీ అరేబియాకు హజ్ యాత్ర ఖర్చు ఈ ఏడాది అంటే 2023తో పోలిస్తే రూ.50 వేలు తగ్గుతుంది. సౌదీ అరేబియా ప్రభుత్వం 'మోఅల్లిమ్' ఖర్చును 2521 సౌదీ రియాల్స్ తగ్గించడంతో ఈ ఖర్చు తగ్గనుంది.


Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 


Also Read: World in 2023: ప్రపంచం ఎప్పటికీ మర్చిపోని ఘటనలు, ప్రమాదాలు, పరిణామాలకు సాక్ష్యం 2023


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి