Hanuman Jayanti Rally: Jahangirpuri violence new Video goes viral: ఢిల్లీలోని జహంగీర్‌ పురిలో హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన ఊరేగింపులో చోటు చేసుకున్న హింసాకాండకు సంబంధించి ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నిజానికి ఈ వీడియో ఘటన జరగడానికి ముందు రోజుది. అయితే ఇప్పటికే ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకున్న పోలీసులు ఇప్పటి వరకు 25 మంది నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసుల ప్రాథమిక విచారణలో హింస వెనుక కుట్ర దాగి ఉందని తేలింది. దీంతో విచారణను మరింత ముమ్మరం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ హింసాకాండకు ముందు రోజు రికార్డు అయిన వీడియో బయటకు రావడం, అందులో కన్పిస్తున్న దృశ్యాలు చూస్తుంటే.. కుట్ర జరగడం నిజమేనని ఒక నిర్ణయానికి రావడమే కాకుండా సదరు వీడియోను చూసి షాక్ అవుతున్నారు. పోలీసులు విచారణలో భాగంగా జహంగీర్‌ పురిలో జరిగిన హింసాత్మక ఘటనకు ముందురోజుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని బయటకు తీశారు. ఈ వీడియోలో కొంతమంది వ్యక్తులు కర్రలు సేకరిస్తూ కన్పించారు. దీంతో ఆ అబ్బాయిలు ఏ ఉద్దేశ్యంతో కర్రలు సేకరిస్తున్నారనే దానిపై ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు.


ఏప్రిల్ 15కు సంబంధించిన ఈ సీసీటీవీ ఫుటేజీలో చీకటయ్యాక 6 మంది అబ్బాయిలు కర్రలతో కనిపించారు. వాళ్లు ఒకరితో ఒకరు ఎదో విషయమై మాట్లాడుకుంటున్నారు. తరువాత రోజే (ఏప్రిల్ 16) జహంగీర్‌పురిలో జరిగిన హనుమాన్ జయంతి ఊరేగింపులో హింస చెలరేగింది. ఇప్పుడు పోలీసులు ఈ హింసతో ఆ అబ్బాయిలకు ఏదైనా సంబంధం ఉందా? అని తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.  త్వరలోనే ఆ అబ్బాయిలకు, దీనికి ఏదైనా సంబంధం ఉందా? లేదా అనే విషయాన్ని తేల్చేయనున్నారు.



ఇంతకుముందు హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన హింసకు సంబంధించి వైరల్ అయిన వీడియోల్లో ఒక దుండగుడు బహిరంగంగా మారణాయుధాలు, కత్తులతో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ హింసాకాండపై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు జరుపుతోంది. ఈ ఘటనపై ఇప్పటివరకు 3 కేసులు నమోదు అయ్యాయి. అంతేకాకుండా  ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పించిన ప్రాథమిక దర్యాప్తు నివేదికలో హింస వెనుక కుట్ర ఉందనే విషయాన్ని నివేదించారు. మరి నిజంగానే హనుమాన్ జయంతి వేడుకలను చేదు జ్ఞాపకంగా మిగల్చడానికే ఇలా కుట్ర పన్నారా? ఇందులో ఎవరెవరి హస్తం ఉంది? అనే విషయాలు తేలాల్సి ఉంది.


Also Read: Allu Arjun: భారీ ఆఫర్‌ను తిరస్కరించిన అల్లు అర్జున్‌.. అసలు కారణం ఇదే!


Also Read: Kajal Agarwal: బాబుకి జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్.. ట్విట్టర్ లో హోరెత్తుతున్న విషెస్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook