Rahul, Priyanka Gandhi meet victim's family: న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ హత్రాస్‌ (Harthras) లో 19 ఏళ్ల యువతిపై జరిగిన దురాఘాతానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ( CM Yogi Adityanath) మరో కిలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసు విచారణను సీబీఐ (CBI) కి అప్పగిస్తూ శనివారం ఆదేశాలిచ్చారు. అయితే అంతకుముందు దళిత యువతిపై అత్యాచారం, హత్య, బలవంతపు దహనసంస్కారాల ఉదంతంపై యూపీ ప్రభుత్వం సిట్ (SIT) ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మొదట నిర్లక్ష్యంగా వ్యవహరించిన హత్రాస్ ఎస్పీ విక్రాంత్ వీర్, సీఐ రామ్ షాబ్ద్, సహా ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. ప్రభుత్వం దోషులందరికీ కఠినమైన శిక్ష విధిస్తుందని సీఎం ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు. అయితే ఉత్తరప్రదేశ్ హోంశాఖ కార్యదర్శి అవనిష్ అవస్థీ, డీజీపీ హెచ్‌సీ అవస్థీ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన కొన్ని గంటల్లోనే ఉత్తర్వులిచ్చారు.  Also read: Hathras incident: ఎస్పీ సహా ఐదుగురు పోలీసులపై వేటు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే గురువారం హత్రస్‌కు బయలుదేరి వెళ్లలేకపోయిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) లకు శనివారం అనుమతి లభించింది. 50 మంది ఎంపీలతో రాహుల్, ప్రియాంక శనివారం హత్రాస్‌కు బయలుదేరగా.. అక్కడికి వెళ్లేందుకు పోలీసులు ఐదుగురికే అనుమతిచ్చారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు హత్రాస్‌లోని బూల్‌గారి గ్రామానికి వెళ్లి బాధితురాలి కుటుంబాన్ని (victim's family) పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీనిచ్చారు. ఈ సందర్భంగా రాహుల్, ప్రియాంక బాధితురాలి కుటుంబసభ్యులతో దాదాపు 40నిమిషాలకు పైగా మాట్టాడి వాస్తవాలను తెలుసుకున్నారు. యువతి కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు తన ఆందోళనను కొనసాగిస్తామని రాహుల్‌, ప్రియాంక పేర్కొన్నారు. Also Read : Hathras Case: ఆ దుర్మార్గులను నడిరోడ్డుపై కాల్చి చంపాలి: బీజేపీ ఎంపీ ఛటర్జీ 


సెప్టెంబరు 14న పొలం పని చేస్తున్న 19 ఏళ్ల దళిత యువతిపై ఉన్నత వర్గానికి చెందిన నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి, నాలుక కోసి, చిత్రహింసలకు గురిచేశారు. తీవ్రంగా గాయపడిన యువతి రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడుతూ.. ఢిల్లీలోని సప్దర్‌జంగ్ ఆసుపత్రిలో సెప్టెంబరు 29న కన్నుమూసింది. అయితే బాధితురాలి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పజెప్పకుండా, వారిని అనుమతించకుండానే (సెప్టెంబరు 30న) బుధవారం తెల్లవారుజామున 2:30 గంటలకు పోలీసులు బలవంతంగా దహనం చేశారు. అయితే ఈ ఘటనపై నాలుగురోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.  Also read: Hathras Case: నిన్న రాహుల్ గాంధీ.. నేడు డెరిక్ ఓబ్రెయిన్‌.. అలాగే కింద‌ప‌డేశారు!