Heavy Rains Alert: మరో రెండ్రోజులు గుజరాత్‌లో భారీ వర్షాలు, 11 మంది మృతి
Heavy Rains Alert: దేశవ్యాప్తంగా నైరుతి రుతు పవనాల ప్రభావం కన్పిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలపై ఆ ప్రభావం స్పష్టంగా పడుతోంది. ఇప్పటికే గత రెండ్రోజుల్నించి గుజరాత్‌లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం..
Heavy Rains Alert: దేశంలోని తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రతో పాటు గుజరాత్ రాష్ట్రాలకు భారీ వర్షాలు పొంచి ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశమంతా రుతుపవనాల ప్రభావం గట్టిగా ఉండటంతో భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి.
మరో రెండ్రోజుల్లో దేశమంతా నైరుతి రుతు పవనాలు విస్తరించనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే భారీ వర్షాలతో కుదేలవుతున్న గుజరాత్ రాష్ట్రానికి మరింత ముప్పు పొంచి ఉంది. రాష్ట్రంలో ఇటీవల కొద్దికాలంగా కురుస్తున్న భారీ వర్షాలకు 11 మంది మరణించారు. చాలా ప్రాంతాల్లో వరద పరిస్థితి భయానకంగా ఉంది. రాష్ట్రంలోని కొన్ని గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. నిన్నిచి నుంచి ఇవాళ ఉదయం వరకూ 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలకు వల్సాద్, నవ్సారి జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల్నీ జలమయమయ్యాయి. రహదారులు, రోడ్లు దెబ్బతినడంతో కొన్ని ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
భారీ వర్షాల కారణంగా గుజరాత్‌లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో మునిగి ఉన్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో సగటున 32 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. వల్సాద్ జిల్లాలో మాత్రం 234 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. ఇక నవ్సారి, జూనాగఢ్, అమ్రేలి, చోటా ఉదయ్‌పూర్, అహ్మదాబాద్, సురేంద్రనగర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 100-234 మిల్లమీటర్ల వర్షపాతం కురిసింది. రానున్న రెండ్రోజుల్లో నైరుతి రుతు పవనాలు దేశమంతా విస్తరించనుండటంతో దక్షిణ గుజరాత్, సౌరాష్ట్ర జిల్లాల్లో రేపటి వరకు భారీ వర్షాలు తప్పవని తెలుస్తోంది.
Also read: Maharashtra NCP Crisis: ట్రిపుల్ ఇంజిన్ సర్కారు మాది.. అజిత్ పవార్ చేరికపై సీఎం ఏక్‌నాథ్ షిండే కామెంట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook