దేశ రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాలు పురాతన భవనాలు నేలకూలుతున్నాయి. పల్లపు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకూ 30 మంది మరణించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ వాణిజ్య రాజధాని నగరం ముంబైలో భారీ వర్షాలు(Mumba heavy rains)ఇంకా కొనసాగుతున్నాయి. వర్షాల కారణంగా నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన సంఘనటల్లో 30 మంది మరణించారు. చెంబూరులో 19 మంది, విక్రోలిలో 10 మంది, భాండూపులో ఒకరు మృతి చెందారు. పురాతన భవనాలు నేలకూలడంతో శిధిలాల కింద కూరుకుని కొంతమంది మృతి చెందారు. చెంబూరు వాషికానా న్యూ భరత్ నగర్‌లోని పంజాబ్ దాండా పరిసరాల్లో కొండకింద ఉన్న ప్రహారీపై కొండ చరియలు పడటం(Landslides),ప్రహారీ ఇళ్లపై పడటం జరిగింది. ఈ ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు.16మందిని సురక్షితంగా బయటకు తీశారు. అటు విక్రోలిలోని సూర్యనగర్ ప్రాంతంలో ఓ రెండంతస్థుల భవనం కూలడంతో 10 మంది మరణించారు. ముంబై వరదల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. 


భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains)ముంబైని ముంచేశాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి.కేవలం 5 గంటల వ్యవధిలో 2 వందల మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తాగునీటికి జనం కటకటలాడుతున్నారు. ముంబైలోని రహదారులన్నీ చెరువులు, కాలువల్ని తలపిస్తున్నాయి.


Also read: Academic Year: అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం : UGC


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook