తమిళనాడును వీడని వరణుడు.. నేడు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన
Tamilnadu rains: తమిళనాడులో నేడు మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది. దీనితో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు.
IMD has predicted heavy to very heavy rainfall over Tamil Nadu: తమిళనాడులో వర్ష బీభత్సం ఆగటం లేదు. గురువారం కురిసిన వర్షాలకు (Tamil Nadu rains) చాలా ప్రాంతాలను వరద ముంచెత్తింది. ఈ నెల ఆరంభం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తమిళనాడు ప్రజలు అవస్తలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే కురిసిన వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా.. నేడు మరోసారి భారీ వర్ష సూచన చేసింది (IMD on Tamil Nadu rains) వాతావరణ శాఖ.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి వాయుగుండంగా కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. చెన్నై సమీపంలో నేడు తీరం దాటే అవకాశముందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో రానున్న మూడు గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఈ ప్రభావంతో తీర ప్రాంత జిల్లాలకు (మొత్తం 16 జిల్లాలకు) రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఆయా ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు. ప్రజలు అసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు.
Also read: 'దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపే': సుప్రీంకోర్టు
Also read: 'టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్, నిఖిల్ జైన్ల వివాహం భారత్‌లో చట్టబద్దం కాదు'
ఆయా ప్రాంతాల్లో మరికొన్ని రోజరు వర్షాలు..
నీలగిరి, ధర్మపురి, కృష్ణగిరి, తిరపత్తూర్, వెళ్లూరు, కడలూరు ప్రాంతాల్లో మరికొన్ని రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెన్నై వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర తమిళనాడులో గంటకు 65 కిలో మీటర్ల వేగంతో గాలులు విచే అవకాశముందని.. ఈ కారణంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
Also read: మహారాష్ట్రలో 14 ఏళ్ల గిరిజన బాలిక పై అత్యాచారం.. నిందితుడు అరెస్టు
పుదుచ్చేరీలోను భారీ వర్షాలు..
వాయుగుండం కారణంగా పుదుచ్చేరీలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం మధ్యాహ్నం వరకు ఇక్కడ 13.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. నేడు కూడా వర్షాలు కురిసే అవకాశముందని (Puducherry rains) పేర్కొంది.
ఏపీలోనూ కుండపోత వానలు..
ఏపీలోని చిత్తూరు జిల్లాలోను భారీ గురువారం అతిభారీ వర్షాలు (AP rains) కురిశాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. కుండోపోత వానలతో జనజీవనం స్తంభించింది.
శేషాచలం కొండల నుంచి వస్తున్న భారీ వరద నీటితో తిరుపతి నగరం (Tirupati Floods) జలదిగ్బంధంలో చిక్కుకుంది. మరోవైపు.. తిరుమల ఘాట్‌రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. రెండు ఘాట్‌రోడ్లలో రాకపోకలు నిలిపివేశారు అధికారులు.
కడప,అనంతపురం, నెల్లూరు జిల్లాల్లోనూ భారీగా వర్షాలు కురిశాయి. వరదల కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాయుగుండం కారణంగా నేడు కూడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
Also read: బ్రేక్‌ఫాస్ట్‌లో 'చచ్చిన పాముపిల్ల'...56 మంది విద్యార్థులకు అస్వస్థత
కర్ణాటకలోనూ వర్షాలు..
కర్ణాటకలోనూ చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో పాఠశాలలకు శుక్రవారం సెలవు ప్రకటించింది. చిక్కమగళూర, హసన్, కొడగు, శివమొగ్గ, తమకురు, కోలార్, మండ్యా సహా పలు ప్రాంతాల్లో నేడు భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు స్థానిక (Karnataka rains) వాతావరణ శాఖ పేర్కొంది.
Also read: గురుద్వారాలో శుక్రవారం ముస్లింల ప్రార్థనలు.. ముస్లిం సోదరులకు స్వాగతం పలికిన గురుద్వారా అసోసియేషన్
Also read: తల్లి సెల్ ఫోన్ తీసుకుందని మస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook