Hubli Girl Murder Muslims Come Out In Supports Of Deceased Family: కర్ణాటకలోని కాలేజీ క్యాంపల్ కార్పోరేటర్ హట్య ఘటన పెను సంచలనంగా మారింది. దీనిపై సీఎం కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణచేపట్టాలని పోలీసులను ఆదేశించారు. ఇదిలా ఉండగా.. దీనిపై కర్ణాటకలో తీవ్ర నిరసనలు జరుగుతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా వార్తలలో నిలిచిన అంశమేంటంటే ముస్లింలు కూడా, బాధిత కుటుంబానికి మద్దతు పలికారు. ఘటనకు పాల్పడిన ఫయాజ్ అనే యువకుడిని కఠినంగా పనిష్మెంట్ చేయాలంటూ కూడా తమ నిరసనలు తెలిపారు. "నేహా హిరేమత్‌కు న్యాయంచేయాలని.. ముస్లింలు మరణించిన వారి కుటుంబానికి మద్దతుగా ముందుకు వచ్చారు. హుబ్బళ్లి-ధార్వాడ జంట నగరాలను వణికించిన దారుణమైన చర్యను ఖండిస్తూ హిరేమఠ్ కుటుంబానికి సంఘీభావంగా కర్ణాటకలో ఉన్న.. ముస్లింల యాజమాన్యంలోని అనేక దుకాణాలను సగం రోజుపాటు మూసివేశారు. పెద్ద ఎత్తున తమ నిరసనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో.. భారీ సంఖ్యలో ముస్లిం పురుషులు,  మహిళలు కూడా పాల్గొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Gwalior Girl Marries Lord Krishna: శ్రీ కృష్ణ పరమాత్ముడిని పెళ్లాడిన యువతి... జీవితమంతా బృందావనంలోనే..?


అదే విధంగా.. నిన్న సోమవారం, ఏప్రిల్ 22, కళాశాల విద్యార్థిని నేహా హీరేమత్ హత్యలో నిందితుడు ఫయాజ్ ఖోండునాయక్‌ను నిరసిస్తూ ప్రదర్శన నిర్వహించారు. బాధిత కుటుంబానికి బహిరంగంగా ముస్లింలు తమ మద్దతు తెలిపారు. హుబ్బళ్లి-ధార్వాడ్ జంట నగరాన్ని కదిలించిన దారుణమైన చర్యను ఖండిస్తూ హిరేమఠ్ కుటుంబానికి సంఘీభావంగా దుకాణదారులు పోస్టర్‌లు,ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. అంతేగాక, అంజుమన్-ఎ-ఇస్లాం అనే ముస్లిం సంస్థ.. ఇలాంటి చర్యలను ఇస్లాం కూడా ప్రభోదించదని కూడా తెలిపారు.


విద్యార్థులు గౌరవించబడాలి.. రక్షించబడాలంటూ బ్యానర్లు తమచేతుల్లో పట్టుకుని నిరసనలు తెలిపారు. ఇదిలా ఉండగా.. నేహా హత్య కేసుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త నిరసనలో భాగంగా బీజేపీ కూడా నగరంలో ప్రదర్శనలు నిర్వహిస్తుండడంతో, రిజర్వ్‌డ్ పోలీసు బలగాలను మోహరించి విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. హుబ్బళ్లి-ధార్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ కౌన్సిలర్ నిరంజన్ హిరేమత్ కుమార్తె 23 ఏళ్ల నేహా హిరేమత్ ఏప్రిల్ 18 న హత్యకు గురైంది. గురువారం నాడు BVB కాలేజీ క్యాంపస్‌లో ఫయాజ్ ఖోండునాయక్  తనను ప్రేమించట్లేదని కత్తితో క్యాంపస్ లో ఆమెపై దాడిచేసి హతమార్చాడు.


Read More: Breakups Leaves: ఉద్యోగులకు కంపెనీ బంపర్ ఆఫర్.. బ్రేకప్ అయిన వాళ్లకు అన్ లిమిటెడ్ లీవ్స్..


నేహా అనే యువతి.. మొదటి సంవత్సరం మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (MCA)చదువుతుంది. ఫయాజ్ ఆమె సీనియర్ కొన్నిరోజులుగా ప్రేమించాలంటూ వేధించి,ఆమె ఒప్పుకొకపోవడంతో ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సీఎం సిద్దరామయ్య కూడా స్పందించినట్లు తెలుస్తోంది. ఘటనను సీబీఐకు అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగింది. లవ్ జీహాద్ కు చెందిన ఘటన అంటూ ఈ హత్య ప్రస్తుతం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ ఘటనను మాత్రం కులమతాలకు అతీతంగా అందరు తమ నిరసనలను తెలియజేస్తున్నారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter