Festival Offers: దసరా పండుగ బంపర్ ఆఫర్లు, ఐసీఐసీఐ ప్రత్యేక ఆఫర్లు ఇవే
Festival Offers: పండుగలొస్తే చాలు ప్రత్యేక ఆఫర్ల సందడి కొనసాగుతుంటుంది. సాధారణంగా పండుగ వేళల్లో ప్రత్యేక ఆఫర్లు వ్యాపారస్థులు లేదా ఈ కామర్స్ వేదికలు ఇస్తుంటాయి. కొద్దికాలంగా ట్రెండ్ మారింది. బ్యాంకులు సైతం పండుగ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దసరా పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లు ఏమున్నాయో పరిశీలిద్దాం.
Festival Offers: పండుగలొస్తే చాలు ప్రత్యేక ఆఫర్ల సందడి కొనసాగుతుంటుంది. సాధారణంగా పండుగ వేళల్లో ప్రత్యేక ఆఫర్లు వ్యాపారస్థులు లేదా ఈ కామర్స్ వేదికలు ఇస్తుంటాయి. కొద్దికాలంగా ట్రెండ్ మారింది. బ్యాంకులు సైతం పండుగ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దసరా పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లు ఏమున్నాయో పరిశీలిద్దాం.
దసరా పండుగ సమీపిస్తోంది. ఇటు ఈ కామర్స్ వేదికలు ఇప్పటికే బిగ్‌సేల్ ధమాకా ప్రారంభించేశాయి. మరోవైపు ఫెస్టివల్ సీజన్(Festival Season)పేరుతో పలు బ్యాంకులు బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా ఐసీఐసీఐ బ్యాంకు అద్భుతమైన ఆఫర్లతో ముందుకొచ్చింది. కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కేవలం 11 వందల రూపాయల ప్రోసెసింగ్ ఫీజు, 6.70 శాతం వడ్డీతో హోంలోన్(Home Loan), 10.25 శాతం వడ్డీతో పర్సనల్ లోన్ అందిస్తోంది. అక్టోబర్ 1 నుంచి ఈ ప్రత్యేక ఆఫర్ అందుబాటులో వచ్చింది.
ఐసీఐసీఐ(ICICI) అందిస్తున్న ప్రత్యేక ఆఫర్లు(ICICI Festival Offers)
ఆటో లోన్ 8 ఏళ్లకు తీసుకోవచ్చు. ప్రతి లక్ష రూపాయలకు నెలసరి వాయిదా 799 రూపాయలు మాత్రమే. ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్(Personal Loan)పేరుతో వ్యక్తిగత రుణాన్ని కేవలం 10.25 శాతం వడ్డీతో అందిస్తుంది. దీనికి ప్రోసెసింగ్ ఫీజు కేవలం 1999 రూపాయలు మాత్రమే. ఎంటర్‌ప్రైజ్ లోన్ విషయంలో ఓవర్ డ్రాఫ్ట్‌గా 50 లక్షల వరకూ అన్ గ్యారంటీడ్ లోన్ తీసుకోవచ్చు. ఎంత తీసుకున్నారో ఆ మొత్తానికి వడ్డీ మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. రుణాన్ని ముందుగానే చెల్లిస్తే..ఎలాంటి ఛార్జి ఉండదు. ఇక కన్జ్యూమర్ లోన్(Consumer Loan)కింద గృహోపకరణాలు, డిజిటల్ ప్రాడక్ట్‌లను నో కాస్ట్ ఈఎంఐతో సొంతం చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది.ఇక ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం. ఆర్ధిక ఇబ్బందుల్ని బయటపడేందుకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని అందిస్తారు బ్యాంకులు.సేవింగ్ లేదా కరెంట్ అక్కౌంట్‌లో జీరో బ్యాలెన్స్ ఉన్నా సరే..ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం వర్తిస్తుంది. చెల్లించాల్సిన సమయంలో చెల్లించేస్తే సమస్య ఉండదు. లేకపోతే వడ్డీ పడుతుంది.
ఇక ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా, టాటా క్లిక్, పేటీఎం మాల్ వంటి ఈ కామర్స్ వేదికల్లో ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. శాంసంగ్, రెడ్‌మి, వన్‌ప్లస్, రియల్‌మి, ఒప్పో, వివో ఫోన్లపై డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఉన్నాయి. షాపర్స్ స్టాప్, లైఫ్‌స్టైల్, సెంట్రల్, అజియో, ఫ్లిప్‌కార్ట్‌లలో షాపింగ్ ద్వారా పది శాతం డిస్కౌంట్ పొందవచ్చు. 50 వేల రూపాయల కొనుగోలుపై 5 వేల వరకూ క్యాష్‌బ్యాక్ ఉంటుంది. ఇక ప్రయాణాలకు సంబంధించి మేక్ మై ట్రిప్, యాత్ర, పేటీఎం నుంచి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే 25 శాతం వరకూ రాయితీ లభిస్తుంది. ఫుడ్ డెలివరీ విషయంలో జొమాటో, ఈజీ డిన్నర్, స్విగ్గి, బ్రికెట్‌లలో కచ్చితంగా 50 శాతం వరకూ తగ్గింపు ఉంటుంది.
Also read: OTT Release Movies: ఓటీటీలో ఈవారం విడుదల కానున్న సినిమాలివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి