ఈ-చెత్త పేరుకుపోతుండటంతో రాజస్థాన్ ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజల పాత ఫోన్లు, పాత కంప్యూటర్లు, రూటర్లు, ఎలక్ట్రానిక్ సామాగ్రిని కొనుగోలు చేసే పథకాన్ని ప్రవేశపెట్టింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియన్ ఆయిల్, గ్రీన్ స్పేస్, ఇంస్టాక్యాష్ భాగస్వామ్యంతో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రజలు తమ వద్ద ఉన్న ప్లాస్టిక్ బ్యాగులను ఇచ్చి జ్యూట్ బ్యాగులను పొందే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. 'ఈ-చెత్త అనేది ఓ పెద్ద సమస్య. కాబట్టి దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి మేము ప్రచారం చేస్తున్నాము' అని రాజస్థాన్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ అపర్ణ అరోరా తెలిపారు.


జైపూర్ సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బ్యాంకుల వద్ద ఇప్పటికే 20 కలెక్షన్ కౌంటర్లను ఏర్పాటు చేశామంది. ప్లాస్టిక్ కాలుష్యం గురించి అవగాహన పెంచి, ప్లాస్టిక్ కాలుష్యానికి కారణమయ్యే ప్లాస్టిక్ సంచులను ఇవ్వాలని ప్రభుత్వం ప్రజలను కోరింది. ప్లాస్టిక్ సంచులకు బదులు జనప నార సంచులను అందిస్తామంది.