Independence Day 2024: స్వాతంత్య్ర దినోత్సవం అనంతరం జాతీయ జెండాను ఇష్టానుసారంగా పడేస్తున్నారా? ముందుగా ఈ ఫ్లాగ్ కోడ్ తెలుసుకోండి..
Independence Day 2024 Flag Code: చాలామంది స్వాతంత్య్ర దినోత్సవం రోజు జెండాను కొనుగోలు చేసి వివిధ రకాలుగా అలంకరించి జెండాను ఎగురవేస్తారు. ఆ తర్వాత రోజు వాటి పరిస్థితి రోడ్లపై విచ్చలవిడిగా కనిపిస్తాయి. అంతేకాదు కొందరైతే జెండాను ఎగురవేసిన మరుక్షణమే వాటిని ఇష్టానుసారంగా పాడేస్తారు.
Independence Day 2024 Flag Code: స్వాతంత్య్ర దినోత్సవం ప్రతి ఏటా ఆగష్టు 15వ తేదీనా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా అతి చేరువలో ఉంది. ఆరోజు ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీలు ఇతర కార్యాలయాల్లో మువన్నెల పతాకాన్ని ఎగురవేస్తారు. తమ దేశభక్తిని చాటుకుంటారు. అయితే, ఆ తర్వాత రోజు జాతీయ జెండాను ఏం చేస్తారు? రోడ్లపై విచ్చలవిడిగా పడేసేవారున్నారు.
అవును, చాలామంది స్వాతంత్య్ర దినోత్సవం రోజు జెండాను కొనుగోలు చేసి వివిధ రకాలుగా అలంకరించి జెండాను ఎగురవేస్తారు. ఆ తర్వాత రోజు వాటి పరిస్థితి రోడ్లపై విచ్చలవిడిగా కనిపిస్తాయి. అంతేకాదు కొందరైతే జెండాను ఎగురవేసిన మరుక్షణమే వాటిని ఇష్టానుసారంగా పాడేస్తారు. అయితే, జాతీయ జెండాకు సంబంధించిన ఫ్లాగ్ కోడ్ (Flag Code) గురిమచి మీకు తెలుసా?
త్రివర్ణ పతకాన్ని ఇలా రోడ్డు మీద పాడేయడం చట్టరీత్యా నేరం. ఇది ఎంత మందికి తెలుసు? ముఖ్యంగా గుడ్డతో తయారు చేసినవి కాకుండా పేపర్ తో తయారు చేసిన త్రివర్ణ పతకాన్ని రోడ్లుపై పాడేస్తారు. ముఖ్యంగా ఈసారి కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని సూచనలు ఇచ్చింది. ఇలా ఇష్టానుసారంగా రోడ్లపై పాడేయకుండా తగిన చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది.
స్వాతంత్య్ర దినోత్సవం అనంతరం మన జాతీయ జెండాను గౌరవప్రదంగా డిస్పోజ్ చేయాలని, దానికి సంబంధించి అవగాహన చర్యలు చేపట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దీనికి సంబంధించి ఓ సర్క్యూలర్ కూడా జారీ చేసింది. ఈరోజు ఫ్లాగ్ కోడ్‌కు సంబంధించిన నియమాలు ఏంటో తెలుసుకుందాం.
ఇదీ చదవండి: దేశంలో టాప్ మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలు, వర్శిటీల జాబితా విడుదల
ముఖ్యంగా ఈ ఫ్లాగ్ కోడ్ నియమం ప్రకారం జాతీయ జెండాను నేలపై ఇష్టానుసారంగా పాడేయకూడదు.
అంతేకాదు మన త్రివర్ణ పతకాన్ని నడుముకు కింది భాగంలో చుట్టుకోకూడదు.
అంతేకాదు దీన్ని ఏ వస్తువుపై కూడా కప్పకూడదు.
జాతీయ జెండాను ఎగురవేసినప్పుడు దానికి ఎత్తులో ఏ ఇతర జెండాలు ఉండకూడదు.
ఈ జాతీయ జెండాలో కాషాయ రంగు పైన మధ్యలో తెలుపు రంగు, కింద భాగంలో ఆకుపచ్చ రంగులో ఉండాలి.
జెండా చిరగకుండా ఉండాలి, సగం కిందకు దించకూడదు
ముఖ్యంగా జాతీయ జెండాపై ఏం రాయకూడదు
జాతీయ జెండాను కాళ్లతో తొక్కకూడదు.
జెండాను ఎగురవేసే వ్యక్తి జాతీయ పతాకానికి కుడివైపున ఉండాలి.
ఇదీ చదవండి: హర్ ఘర్ తిరంగ సర్టిఫికేట్ కావాలా? ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకోండి..
అయితే, ఆ ఫ్లాగ్ కోడ్‌ను ఉల్లంఘిస్తే తగిన శిక్ష కూడా విధిస్తారు. మన జాతీయ జెండా దేశానికే గర్వకారణం. అందుకే దీనిపై కాస్త బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. జాతీయ జెండాకు సంబంధించి ఈ పొరపాట్లు చేయకుండా ఉండాలి.ఇది ప్రతి ఒక్కరీ బాధ్యత. గతంలో మన జాతీయ జెండాను కేవలం ఖాదీ వస్త్రంతో మాత్రమే తయారు చేసేవారు. ఆ తర్వాత పాలిస్టర్‌తో తయారు చేసే అనుమతి కూడా ఇచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter