NIRF Ranking 2024 Live: దేశంలో టాప్ మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలు, వర్శిటీల జాబితా విడుదల

NIRF Ranking 2024 Live: దేశవ్యాప్తంగా ఎన్నో ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ఏవి బెస్ట్ ఏవి కాదనేది తెలుసుకోగలగాలి. దీనికోసమే ప్రతిఏటా NIRF ర్యాంకింగ్ ఉంటుంది. ఇవాళ మరి కాస్సేపట్లో ఈ ర్యాంకింగ్ వెలువడనుంది. పూర్తి వివరాలు మీ కోసం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 12, 2024, 11:06 AM IST
NIRF Ranking 2024 Live: దేశంలో టాప్ మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలు, వర్శిటీల జాబితా విడుదల

NIRF Ranking 2024 Live: దేశవ్యాప్తంగా ఏ ఏడాది ఏ కళాశాలలు టాప్ ర్యాంకింగ్‌లో ఉన్నాయో చెప్పేదే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్. స్థూలంగా చెప్పాలంటే ఎన్ఐఆర్ఎఫ్. దేశవ్యాప్తంగా 13 కేటగిరీల్లో  టాప్ యూనివర్శిటీలు, టాప్ కళాశాలలు, బెస్ట్ ఇంజనీరింగ్, మెడికల్, లా, మేనేజ్‌మెంట్, ఫార్మా, ఆర్కిటెక్చర్ విభాగాల్లో ర్యాంకింగ్ ఇస్తుంటారు. ఈ ఏడాదికి సంబంధించిన NIRF 2024 మరి కాస్సేపట్లో వెలువడనుంది. 

కేంద్ర విద్య శాఖ ఇవాళ అంటే ఆగస్టు 12వ తేదీ మద్యాహ్నం 3 గంటలకు NIRF 2024 జాబితా విడుదల చేయనుంది. ఇందులో మొత్తం 13 కేటగిరీలకు చెందిన టాప్ కళాశాలలు లేదా యూనివర్శిటీలు ఏవనేది తేలిపోనుంది. గత ఏడాది అంటే 2023లో ఐఐటీ మద్రాస్ ఓవరాల్ ర్యాంకింగ్‌లో మొదటి స్థానంలో నిలవగా, యూనివర్శిటీల్లో IISc Bengaluru టాప్‌లో నిలిచింది. ఇక బెస్ట్ మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌గా ఐఐఎం అహ్మదాబాద్ స్థానం దక్కించుకుంది. ఇక టాప్ కళాశాలగా మిరాండా హౌస్ నిలిచింది. ఈ ర్యాంకింగ్‌లో దేశవ్యాప్తంగా మొత్తం 8686 విద్య సంస్థలు పోటీపడ్డాయి. 2022లో 7254 సంస్థలు పోటీలో ఉన్నాయి. 2021లో 6272 సంస్థలు పోటీ పడ్డాయి. ప్రతి ఏటా ఈ సంఖ్య పెరుగుతోంది.

నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ అనేది 2015లో ప్రారంభమైంది. ఈ ర్యాంకింగ్ ఇచ్చేటప్పుడు టీచింగ్, లెర్నింగ్, రిసోర్సెస్, రీసెర్చ్, ప్రొఫెషనల్ ప్రాక్టీసెస్, గ్రాడ్యుయేషన్ అవుట్ కమ్, ఔట్ రీచ్, ఇన్‌క్లూజివిటీ, పెర్‌సెప్షన్ వంటి అంశాల్ని పరిగణలో తీసుకుంటారు. 

Also read: Happy Independence Day 2024: పంద్రాగస్టున అందరినీ ఇలా విష్ చేయండి, టాప్ 10 విషెస్, కోట్స్, మెన్సెస్ మీ కోసం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News