Har Ghar Tiranga Certificate Download:హర్ ఘర్ తిరంగా నినాదం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 2022లో భాగంగా ప్రారంభించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో జాతీయ జెండాను గౌరవప్రదంగా ఎగురవేసేందుకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రచారం ఆగష్టు 9 వ తేదీ నుంచి 15 వరకు నిర్వహిస్తారు.
మీరు కూడా హర్ ఘర్ తిరంగా ప్రచారంలో మీ ఇంటిపై జెండాను ఎగురవేయాలనుకుంటే మీరు జెండాను ఎగురవేసి ఓ సెల్ఫీ జెండాతో తీసుకుని Harghartiranga.com కు పంపించాలి. మీరు జాతీయ గీతం పాడుతున్న ఫోటోను కూడా అప్లోడ్ చేయవచ్చు.
హర్ గర్ తిరంగా సర్టిఫికేట్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.. మొదటగా Harghartiranga.com వెబ్‌సైట్‌లోని హోం పేజీలో 'క్లిక్ పార్టిసిపేట్' ట్యాబ్‌ను ఎంపిక చేసుకోవాలి.
అక్కడ మీ పేరు, ఫోన్ నంబర్, రాష్ట్రం, దేశం వివరాలు నమోదు చేయాలి. మీ వివరాలు పూర్తిగా నమోదు చేసిన తర్వత అక్కడ ఉన్న ప్రతిజ్ఞ “I swear that I will hoist the Tricolour, respect the spirit of our freedom fighters and brave sons, and dedicate myself to the development and progress of India.” ను చదవాలి.
ఈ స్టెప్ పూర్తయిన తర్వాత 'టేక్ ప్లెడ్జ్' పై క్లిక్ చేయాలి. అప్పుడు ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు తిరంగాతో తీసుకున్న సెల్ఫీ ఫోటోలు అప్లోడ్ చేయాలి.
ఆ తర్వాత మీ అంగీకారం అడుగుతుంది. చివరగా సబ్మిట్ చేయాలి. ఈ వివరాలన్ని మీరు నమోదు చేశాకా 'జనరేట్ సెర్టిఫికేట్' పై క్లిక్ చేయాలి.చివరగా డౌన్‌లోడ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ షేర్ ఐకాన్ కనిపిస్తుంది. దీన్ని మీరు ఆన్‌లైన్‌లో పోస్టు చేసుకోవచ్చు.ఇందులో తిరంగా యాత్రాస్, ర్యాలీస్, మ్యారథాన్, క్యాన్వాస్, నివాలి, మేళా వంటివి కూడా ఈ హర్ గర్ తిరంగా ప్రచారంలో అందుబాటులో ఉన్నాయి.