47 Chinese apps: చైనాకు చెందిన మరో 47 క్లోన్ యాప్స్‌పై భారత్ నిషేధం
47 Chinese clone apps: చైనా యాప్స్‌పై భారత్ మరోసారి ఉక్కుపాదం మోపింది. జూన్‌లో నిషేధించిన 59 చైనీస్ యాప్స్‌కి క్లోన్ అయిన 47 చైనీస్ యాప్‌లను ( China apps ) భారత్ నిషేధించింది. టిక్ టాక్ లైట్, కామ్ స్కానర్ అడ్వాన్స్ వంటి యాప్స్ తాజాగా నిషేధానికి గురైన యాప్స్ జాబితాలో ఉన్నాయి.
47 Chinese clone apps: చైనా యాప్స్‌పై భారత్ మరోసారి ఉక్కుపాదం మోపింది. జూన్‌లో నిషేధించిన 59 చైనీస్ యాప్స్‌కి క్లోన్ అయిన 47 చైనీస్ యాప్‌లను ( China apps ) భారత్ నిషేధించింది. టిక్ టాక్ లైట్, కామ్ స్కానర్ అడ్వాన్స్ వంటి యాప్స్ తాజాగా నిషేధానికి గురైన యాప్స్ జాబితాలో ఉన్నాయి. 47 చైనీస్ క్లోన్ యాప్స్‌పై నిషేధం విధిస్తూ శుక్రవారమే కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. చైనా కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఇప్పటికే నిబంధనలను కఠినతరం చేసిన తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవలే జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ 2017 ను కేంద్రం సవరించడంతో.. చైనా కంపెనీలు భారత్‌లోకి అడుగుపెట్టడం క్లిష్టతరంగా మారిన సంగతి తెలిసిందే. Also read: GATE 2021 exams: గేట్ 2021 ఎగ్జామ్స్ షెడ్యూల్, అర్హతల సడలింపు వివరాలు
తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద గాల్వన్ లోయలో ( Galwan valley face off ) హింసాత్మక ఘటనలో 20 మంది భారతీయ సైనికులు అమరులు అయిన అనంతరం ప్రముఖ టిక్ టాక్ యాప్‌తో ( Tiktok app ) సహా 59 చైనీస్ యాప్‌లను నిషేధిస్తూ జూన్ 29 న భారత్ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత కూడా నిషేధానికి గురైన యాప్స్‌కి సంబంధించిన పలు క్లోనింగ్ యాప్స్ భారత్‌లో వినియోగంలో ఉండటాన్ని తీవ్రంగా పరిగణిస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. Also read: Time capsule: రామ మందిరం కింద 2 వేల అడుగుల లోతులో టైమ్ క్యాప్సుల్
జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ 2017 సవరణ అనంతరం "భారత్‌తో భూ సరిహద్దును కలిగి ఉన్న దేశాలకు చెందిన ఏ పెట్టుబడిదారుడైనా భారత్‌లో పెట్టుబడులు పెట్టే ముందు భారత్‌లో పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రమోషన్ (DPIIT) విభాగం ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ కమిటీ వద్ద తమ వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందనే కఠిన నిబంధన అమలులోకి వచ్చింది. అంతేకాకుండా విదేశాంగ, హోం మంత్రిత్వ శాఖల నుండి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. Also read: Bytedance: భారత్ దెబ్బకు విలవిలలాడుతున్న చైనా కంపెనీ