Covid-19: భారత్‌లో 44 లక్షలకు చేరువలో కోలుకున్న వారి సంఖ్య
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విజృంభిస్తోంది. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 90 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే.. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా రికవరీ కూడా అదే స్థాయిలో ఉంది.
India Coronavirus updates: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విజృంభిస్తోంది. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 90 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే.. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా రికవరీ కూడా అదే స్థాయిలో ఉంది. గత 24గంటల్లో ఆదివారం ( సెప్టెంబరు 20న ) దేశవ్యాప్తంగా ( India ) కొత్తగా.. 86,961 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 1,130 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాలతో.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 54,87,581 పెరగగా.. మరణాల సంఖ్య 87,882 కి చేరింది. Also read: Hyderabad: లక్షణాలు లేని వారితోనే కరోనా ముప్పు!: సర్వే
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10,03,299 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉండగా.. ఈ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 43,96,399 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే.. ఆదివారం దేశవ్యాప్తంగా 7,31,534 కరోనా టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. దీంతో సెప్టెంబరు 20 వరకు మొత్తం 6,43,92,594 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ప్రస్తుతం దేశంలో దేశంలో కరోనా రికవరి రేటు 80.12 శాతం ఉండగా.. మరణాల రేటు 1.61 శాతం ఉంది.
ఇదిలాఉంటే.. ప్రపంచవ్యాప్తంగా వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య భారత్‌లోనే ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసులు ప్రస్తుతం 3కోట్లు దాటగా వారిలో ఇప్పటికే 2కోట్ల 20లక్షల మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా కోలుకున్న వారిలో భారత్‌లో 43లక్షల 96వేల మంది ఉన్నారు. ఇది ప్రపంచ రికవరీల్లోనే భారత్ 19శాతం ఉందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. Also read: Building Collapses: భివండిలో కూలిన భవనం.. 10 మంది మృతి