India Coronavirus updates: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 80 వేల నుంచి లక్షకు చేరువలో కేసులు
నమోదవుతున్నాయి. దీంతోపాటు ప్రభుత్వం టెస్టులు కూడా నిత్యం 10లక్షలకు పైగానే చేస్తోంది. అయితే గత 24గంటల్లో రికార్డు స్థాయిలో టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఇదిలాఉంటే.. గత 24గంటల్లో గురువారం ( సెప్టెంబరు 24న ) దేశవ్యాప్తంగా ( India ) కొత్తగా.. 86,052 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 1,141 మంది మరణించారు. తాజాగా నమోదైన గణాంకాలతో.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 58,18,571 కి పెరగగా.. మరణాల సంఖ్య 92,290 కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Health Ministry) శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9,70,116 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉండగా.. ఈ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 47,56,165 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. Also read: 
Manish Sisodia: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రికి కరోనాతోపాటు డెంగీ


ఒక్కరోజులో రికార్డు స్థాయిలో కరోనా టెస్టులు..
ఇదిలాఉంటే.. గురువారం దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 15లక్షలకు చేరువలో కరోనా టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. గురువారం ఒక్కరోజే 14,92,409 కరోనా టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఒక్కరోజులో అత్యధిక టెస్టులు చేయడం ఇదే మొదటిసారి అని వెల్లడించింది. దీంతో సెప్టెంబరు 24 వరకు మొత్తం 6,89,28,440 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ప్రస్తుతం దేశంలో దేశంలో కరోనా రికవరి రేటు 81.74 శాతం ఉండగా.. మరణాల రేటు 1.59 శాతం ఉంది. 
 Also read: RCB vs KXIP: కేఎల్ రాహుల్ అరుదైన ఘనత