India COVID 19 Update: భారత దేశ ప్రజలకు శుభవార్త. దేశంలో కరోనా వైరస్ మహమ్మారి కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇటీవలి కాలంలో ప్రతిరోజు దాదాపుగా 20 వేల కొత్త కేసులు నమోదవగా.. రోజురోజుకు ఆ సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది. ఆదివారం 14 వేలుగా ఉన్న కొత్త కేసులు.. సోమవారం 9 వేల దిగువకు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 8,813 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోమవారం (ఆగష్టు 15) 2.12 లక్షల మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 8,813 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పాజిటివిటీ రేటు 4.15 శాతంగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో 15,040 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక మహమ్మారి కారణంగా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 1,11,252 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇతర దేశాలతో పోల్చితే మన దగ్గర రికవరీ రేటు ఎక్కువగా ఉండడం సంతోషించాల్సిన విషయం.



2020 ప్రారంభం నుంచి 4,42,77,194 కోట్ల మందికి కరోనా సోకగా.. 98.46 శాతం (4,36,38,844) మంది వైరస్‌ను జయించారు. మహమ్మారి కారణంగా మొత్తం 5,27,098 మంది ప్రాణాలు కోల్పోయారు. క్రియాశీల కేసులు 1.11 లక్షల (0.25 శాతం)కు పడిపోయాయి. దేశంలో ఇప్పటివరకూ 208.31 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న 6.10 లక్షల మంది టీకా తీసుకున్నారని కేంద్రం వెల్లడించింది. 


Also Read: ఏఐఎఫ్‌ఎఫ్‌కు ఊహించని షాక్.. భారతదేశాన్ని సస్పెండ్‌ చేసిన ఫిఫా! ఆతిథ్య హక్కులు పాయే


Also Read: సొంతూరి కోసం ప్రశాంత్ నీల్ మనసున్న పని.. ఒక్కసారిగా 50 లక్షలు విరాళం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి