ఒక్కరోజులో 11,502 కరోనా కేసులు, 325 మంది మృతి
కరోనా వైరస్ కేసులలో భారత్ ఒక్కో దేశాన్ని వెనక్కి నెట్టేస్తోంది. ప్రజల అజాగ్రత్త, అధికారులు, ప్రజా ప్రతినిధులు చేతులెత్తేయడం కరోనా వైరస్‌కు కలిసొచ్చినట్లుగా కనిపిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ మరింతగా విజృంభిస్తోంది. ఒక్కరోజులోనే ఏకంగా 10వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలవరానికి గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 11,502 మంది కరోనా బారిన పడ్డారు. ఈ కేసులతో కలిపి భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 3,32,424కు చేరింది. అదే సమయంలో 325 మందిని కరోనా బలి తీసుకుంది. సుశాంత్‌ను ప్రశాంతంగా వెళ్లనివ్వండి : Sonu Sood రిక్వెస్ట్
మొత్తం కేసులకుగానూ చికిత్స అనంతరం 1,53,106 మంది కోవిడ్19 మహమ్మారి బారి నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,69,798 యాక్టీవ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ఈ మేరకు సోమవారం (జూన్ 15న) ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ