సుశాంత్‌‌ను ప్రశాంతంగా వెళ్లనివ్వండి : Sonu Sood రిక్వెస్ట్

ఆత్మహత్య చేసుకుని బలవన్మరణం చెందిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) చివరి ఫొటో, వ్యక్తిగత విషయాలు వైరల్ కావడంపై కొందరు సినీ సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 15, 2020, 08:54 AM IST
సుశాంత్‌‌ను ప్రశాంతంగా వెళ్లనివ్వండి : Sonu Sood రిక్వెస్ట్

సెలబ్రిటీలు ఎవరైనా చనిపోయారంటే వారికి సంబంధించిన పలు విషయాలు హాట్ టాపిక్‌గా మారతాయి. ఈ క్రమంలో ఆదివారం ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ‌(34)కు సంబంధించిన ఫొటోలు, వ్యక్తిగత వివరాలు మీడియాతో పాటు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. దీనిపై కొందరు సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నేడు సుశాంత్ (Sushant Singh Rajput) అంత్యక్రియలకు అన్ని ఏర్పాటు చేశారు.  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ లవ్ స్టోరీ, బ్రేకప్

సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో బ్లాక్ టీషర్ట్ ధరించారని, ఆయన డిప్రెషన్ విషయాన్ని అలా తెలియజేశాడంటూ కథనాలు వచ్చాయి. ప్రేమ వ్యవహారాలు బెడిసికొట్టడం, వ్యక్తిగత విషయాలు, కెరీర్‌లో అనుకున్న కలను సాాకారం చేసుకోలేకపోవడం సుశాంత్(Sushant Singh Rajput Commits Suicide)ను కుంగదీశాయని ప్రచారం జరుగుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లాక్‌డౌన్‌లో బరువు పెరిగారా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి

నటుడు సుశాంత్ చివరి ఫొటోలు, వ్యక్తిగత వివరాలు వైరల్ కావడంపై నటుడు సోనూ సూద్ (Sonu Sood) ఆవేదన వ్యక్తం చేశాడు. ఈరోజు మనం ఓ మిత్రుడిని కోల్పోయాం. ఎన్నో ఆశలతో ముంబైకి వచ్చి ఎంతో ఎత్తుకు ఎదిగిన సుశాంత్ ఇలా వెళ్లిపోయాడు. అతడిని ప్రశాంతంగా వెళ్లిపోనిద్దాం. దయచేసి అతడి ఫొటోలు, వ్యక్తిగత వివరాలు షేర్ చేసి వైరల్ చేయవద్దంటూ సోనూ సూద్ ట్వీట్ ద్వారా విన్నవించుకున్నాడు.  మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ

నటి ఖుష్బూ సైతం సుశాంత్ విషయంపై బాధతో స్పందించారు. ఇలాంటి సమయాల్లో చాలా సున్నితంగా వ్యవహరించాయిలి. సుశాంత్ చివరి ఫొటో వైరల్ అవుతోంది. అతడి కుటుంబం ప్రైవసీకి భంగం కలిగించవద్దు. వారిపై మనం ప్రేమ, జాలి, మానవత్వం చూపించాల్సిన తరుణమిదంటూ నటి ఖుష్బూ ట్వీట్ చేశారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్

 

 

Trending News