India Covid Updates: కరోనా కేసులలో (Corona Cases) రోజు రోజుకు హెచ్చు తగ్గులను గమనించవచ్చు. నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయని చెప్పవచ్చు, బుధవారం 18 వేలకు పైగా పాజిటివ్‌గా కేసులు నిర్దారణ అవ్వగా.. ఈ రోజు 14 శాతం పాజిటివ్ కేసులు తగ్గాయని చెప్పవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గురువారం 13,24,263 మందికి కోవిడ్ నిర్దారణ పరీక్షలు చేయగా.. 15,786 మందికి మందికి కరోనా వైరస్ (Corona Positive) పాజిటివ్‌గా తేలింది. బుధవారం రోజు కన్నా కొత్త కేసుల్లో 14 శాతం తగ్గుదల కనిపించింది. నిన్న 231 మంది కరోనా వైరస్ కారణంగా ప్రాణాలను కోల్పోయారు. 18,641 మంది కరోనా వైరస్ నుండి కోలుకున్నారు. 


Also Read: Sarkaru Vaari Paata update: సర్కారు వారి పాట ఫస్ట్ సాంగ్‌ అప్‌డేట్ ఇచ్చిన తమన్




దీంతో మొత్తం కేసులు 3.41 కోట్లకు (Total Corana Cases) చేరగా.. అందులో 3.35 కోట్ల మంది వైరస్ నుంచి బయటపడ్డారు.  ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 1,75,745కి (Active cases) చేరింది. క్రియాశీల రేటు 0.51 శాతానికి తగ్గగా .. రికవరీ రేటు (Recovery Rate) 98.16 శాతానికి పెరిగింది. కరోనా మహామ్మారి విజృంభణ ప్రారంభం అయినప్పటి నుండి అత్యధిక రికవరీ రేటు ఇదే అని చెప్పవచ్చు. నిన్న మరో 231 మంది ప్రాణాలు (covid Deaths) కోల్పోయారు. ఇప్పటి వరకు 4.53 లక్షల కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. 


నిన్న ఒక్కరోజే 61,27,277 మంది కరోనా టీకా వేయించుకోవటంతో మొత్తం వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య నిన్నటికి 100 కోట్ల (1 Billion Vaccine) మార్కును దాటింది. ఈ ఘనత సాధించిన కారణంగా కేంద్ర ప్రభుత్వం ఘనంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే.  




Also Read: Petrol Price Hiked: దేశంలో ఆగని పెట్రో మోత- వరుసగా మూడో రోజు ధరల పెంపు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook