Chinese quadcopter sent by Pakistan shot down by Indian Army: న్యూ ఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లోని కేరన్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (LOC) వెంట పాకిస్తాన్ ఆర్మీ ప్రయోగించిన చైనా క్వాడ్‌కాప్టర్‌ను ( China made Pakistani quadcopter ) భారత ఆర్మీ దళాలు కూల్చేశాయి. ఇవాళ ఉదయం 8 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. చైనా కంపెనీ తయారు చేసిన డీజేఐ మావిక్ 2 ప్రో మోడల్ క్వాడ్‌కాప్టర్ నియంత్రణ రేఖ వద్ద చక్కర్లు కొడుతుండటం గమనించిన ఇండియన్ ఆర్మీ బలగాలు ( Indian Army troops ) వెంటనే అప్రమత్తమై దానిని కూల్చేశాయి. Also read : Loan Moratorium: పండుగ కానుక.. లోన్లపై వడ్డీ మాఫీ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాకిస్తాన్ వైపు నుంచి జరిగే దాడులను తిప్పికొట్టేందుకు, చొరబాటుదారులను ( infiltrate ) అడ్డుకునేందుకు నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పోస్టులలో ఉన్న భారత ఆర్మీ బలగాలు అహర్నిశలు అప్రమత్తంగా ఉంటూ నిర్విరామంగా కృషిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే అక్కడి చొరబాట్లను, ఈ క్వాడ్‌కాప్టర్ ( Quadcopter ) తరహా నిఘా దాడులను భారత ఆర్మీ బలగాలు వెంటనే తిప్పికొడుతున్నాయి.


ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నారావనే ( Indian Army chief MM Narawane ) ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ''పాకిస్తాన్ ఉగ్రవాదులను భారత భూభాగంలోకి పంపించడానికి పాక్ ( Pakistan ) అన్ని దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోందని.. అయితే పాకిస్థాన్ కుట్రలను భారత రక్షణ బలగాలు అంతే అప్రమత్తంగా ఉంటూ తిప్పికొడుతున్నాయి'' అని అన్నారు. Also read : Anti-Ship Missile ప‌రీక్ష విజయవంతం.. వీడియో విడుదల


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe