Indian Navy's anti-ship missile launched - Watch Video: న్యూఢిల్లీ: భారత అమ్ములపొదిలోకి మరో అత్యాధునిక మిస్సైల్ చేరింది. ఈ రోజు ఉదయం భారత నౌకాదళం (Navy) యాంటీషిప్ మిస్సైల్ (anti-ship missile) ను విజయవంతంగా పరీక్షించింది. కొర్వెట్టి ఐఎన్ఎస్ ప్రభల్ (INS Prabal ) నుంచి జరిపిన ఈ యాంటీ మిస్సైల్ ప్రయోగానికి సంబంధించిన వీడియోను భారత నావికాదళం ట్విట్టర్ వేదికగా పంచుకుంది. ఐఎన్ఎస్ ప్రభల్ నుంచి జరిపిన యాంటీ మిస్సైల్ పరీక్ష విజయవంతం అయిందని.. ఈ క్షిపణి అనుకున్న లక్ష్యాన్ని ఛేదించి పాత నౌకను తుత్తునియులు చేసినట్లు ఇండియన్ నేవీ పేర్కొంది.
#AShM launched by #IndianNavy Missile Corvette #INSPrabal, homes on with deadly accuracy at max range, sinking target ship. #StrikeFirst #StrikeHard #StrikeSure #हरकामदेशकेनाम pic.twitter.com/1vkwzdQxQV
— SpokespersonNavy (@indiannavy) October 23, 2020
అరేబియా సముద్రంలో జరిగిన ఈ యాంటీషిప్ మిస్సైల్ ప్రయోగం జరిగింది. కొర్వెట్టి ఐఎన్ఎస్ ప్రభల్ నుంచి దూసుకెళ్లిన యాంటీషిప్ (anti-ship) క్షిపణి అతిదూరంలో టార్గెట్‌గా ఉన్న పాతనౌకను పేల్చివేసింది. దీని తాకిడికి ఆ నౌక చెల్లాచెదురై సముద్రంలో మునిగిపోయిన వీడియోను నేవీ పంచుకుంది. అయితే ఈ యాంటీషిప్ క్షిపణులు గరిష్టంగా 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను పేల్చేస్తాయి. Also read: Eastern naval: విశాఖ సముద్రజలాల్లో అత్యాధునిక యుద్దనౌక ఐఎన్ఎస్ కవరట్టి
మిస్సైల్ పరీక్షను నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ (Karambir Singh) పరిస్థితిని సమీక్షించగా.. ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ ఆఫ్ ఈస్టర్న్ నావల్ కమాండ్ వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్, మాజీ అధికారి వీకె సక్సేనా కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదిలాఉంటే.. గురువారం ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే (MM Naravane) అత్యాధునిక సబ్‌మెరైన్ ( Most Advanced Anti Submarine ) యుద్ధనౌక ఐఎన్ఎస్ కవరట్టి ( INS kavaratti ) ని విశాఖపట్నం సముద్రజలాల్లో నేవీలోకి ఇండక్ట్ చేసిన విషయం తెలిసిందే. Also read: Navratri Day 7: శ్రీ మహాలక్ష్మి దేవి అవతారంలో అమ్మవారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe