Indian Railways: ఇండియన్ రైల్వే స్ నుంచి త్వరలో ఏసీ ఎకానమీ కోచ్‌లు
Indian Railways: రైలు ప్రయాణం త్వరలో మరింత సౌకర్యవంతం కానుంది. భారతీయ రైల్వే త్వరలో సరికొత్త ఏసీ ఎకానమీ కోచ్‌లను ప్రారంభించనుంది. కోవిడ్ సంక్షోభం కారణంగా ఆలస్యమైన ఏసీ కోచ్‌లు త్వరలో పట్టాలకెక్కనుంది.
Indian Railways: రైలు ప్రయాణం త్వరలో మరింత సౌకర్యవంతం కానుంది. భారతీయ రైల్వే త్వరలో సరికొత్త ఏసీ ఎకానమీ కోచ్‌లను ప్రారంభించనుంది. కోవిడ్ సంక్షోభం కారణంగా ఆలస్యమైన ఏసీ కోచ్‌లు త్వరలో పట్టాలకెక్కనుంది.
ఇండియన్ రైల్వేస్ (Indian Railways)నుంచి త్వరలో ఏసీ ఎకానమీ కోచ్‌లు(Ac Economy Coaches)అందుబాటులో రానున్నాయి. రైలు ప్రయాణాన్ని మరింతగా సౌకర్యవంతం చేసే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. కపుర్తలలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఈ కోచ్‌లను తయారు చేసింది. ప్రస్తుతం భారతీయ రైల్వేలో అందుబాటులో ఉన్న ఏసీ 3 టైర్ కంటే తక్కువగానూ, నాన్ ఏసీ స్లీపర్ కంటే ఎక్కువగానూ ఏసీ ఎకానమీ కోచ్ ధరలు ఉండనున్నాయి. ఏసీ ఎకానమీ కోచ్ అధికారిక పేరు, లాంచ్ చేయనున్న తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఇప్పటికే ఈ కోచ్‌లు దేశవ్యాప్తంగా వివిధ జోన్‌లకు పంపిణీ పూర్తయినట్టు తెలుస్తోంది.
ప్రతి కోచ్‌లో సాధారణంగా 72 బెర్త్‌లు ఉంటాయి. ఏసీ ఎకానమీ కోచ్ (Ac Economy Coach)లలో మాత్రం 83 బెర్త్‌లు ఉండటం వల్ల ప్రయాణీకుల సామర్ధ్యం మరింతగా పెరగనుంది. ప్రతి బెర్త్‌లో వ్యక్తిగత రీడింగ్ లైట్స్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లతో పాటు బెర్త్‌లకు సొంతంగా ఏసీ వెంట్‌లు ఉంటాయి. ఇక ప్రతి కంపార్ట్‌మెంట్‌లో ఫోల్డబుల్ స్నాక్ టేబుల్, వాటర్ బాటిల్ హోల్డర్లు, మ్యాగజైన్, మొబైల్ ఫోన్ హోల్డర్లు ఏర్పాటు చేశారు. ప్రతి కంపార్ట్‌మెంట్‌కు వీల్ ఛైర్ యాక్సెస్ అదనపు ఆకర్షణగా ఉంటుంది.
Also read: Loksabha Seats: లోక్‌సభ సీట్లు వేయికి పెరగనున్నాయా, మనీష్ తివారీ మాటల్లో నిజమెంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook