భారత దేశంపై చైనా ( China )ఎన్ని కుట్రలు చేసినా భారత్ మాత్రం మానవత్వం చాటడంలో ముందుంటోంది. తాజాగా సిక్కిం లోని 17,500 అడుగుల ఎత్తులో ముగ్గురు చైనావాసులు దారితప్పడంతో వారికి అండగా నిలిచింది భారత సైన్యం ( Indian Army ) . వారికి ముందు వైద్య సహాయం అందించి వారి ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన సెప్టెంబర్ 3న జరిగింది.



 


ఇండియన్ ఆర్మీ అందించిన వివరాల ప్రకారం దారితప్పిన చైనీయులకు సైనికులు ఆక్సిజన్ తో పాటు ఆహారం ( Food ) , వేడి దుస్తువులు అందించారు. తరువాత వారిని చైనా సైనికుల వద్దకు తీసుకెళ్లారు. తరువాత వారికి మార్గదర్శకం చేశారు.



ఈ విషయంపై భారత సైన్యం ఒక ట్వీట్ చేసింది