India: కొనసాగుతున్న కరోనా విజృంభణ.. తాజాగా 94,372 కేసులు
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. నాలుగైదురోజుల నుంచి నిత్యం 90 వేలకు పైగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి.
Covid-19 updates in India: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. నాలుగైదురోజుల నుంచి నిత్యం 90 వేలకు పైగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో శనివారం ( సెప్టెంబరు 12న ) దేశవ్యాప్తంగా కొత్తగా.. 94,372 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 1,114 మంది మరణించారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 47,54,357కి చేరగా.. మరణాల సంఖ్య 78,586కి పెరిగినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: US Open 2020: ఉమెన్స్ సింగిల్స్ ఛాంపియన్‌గా నవోమి ఒసాకా
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9,73,175 కేసులు యాక్టివ్‌గా ఉండగా.. ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు 37,02,596 మంది బాధితులు కోలుకున్నారు. ఇదిలాఉంటే.. శనివారం దేశవ్యాప్తంగా 10,71,702 కరోనా టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. దీంతో సెప్టెంబరు 12 వరకు మొత్తం 5,62,60,928 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. Also read: Amit Shah: మళ్లీ ఆసుపత్రిలో చేరిన హోంమంత్రి షా