Covid-19 updates in India: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం కొనసాగుతూనే ఉంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కొన్ని రోజుల నుంచి రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అయితే దేశంలో నమోదైన కేసులు అరకోటి దాటాయి. అయితే.. గత 24 గంటల్లో మంగళవారం ( సెప్టెంబరు 15న ) దేశవ్యాప్తంగా కొత్తగా.. 90,123 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 1,290 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 50,20,360 కి పెరగగా.. మరణాల సంఖ్య 82,066 కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9,95,933 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉండగా.. ఈ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 39,42,361 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. Also read: Oxford COVID-19 Vaccine: క్లినికల్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతి


ఇదిలాఉంటే.. మంగళవారం దేశవ్యాప్తంగా 11,16,842 కరోనా టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. దీంతో సెప్టెంబరు 15 వరకు మొత్తం 5,94,29,115 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 78.5 శాతానికి పెరగగా.. మరణాల రేటు 1.63శాతంగా ఉంది.  Earthquake: నేపాల్‌లో భారీ భూకంపం..