India: 75 శాతం దాటిన కరోనా రికవరీ రేటు
భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus) మహమ్మారి కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. కరోనా మరణాలు కూడా భారీ సంఖ్యలో సంభవిస్తున్నాయి.
Covid-19 updates in India: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus) మహమ్మారి కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. కరోనా మరణాలు కూడా భారీ సంఖ్యలో సంభవిస్తున్నాయి. గత 24 గంటల్లో ( ఆగస్టు 23 ) కొత్తగా 61,408 కరోనా కేసులు నమోదు కాగా.. 836 మంది ఈ మహమ్మారి కారణంగా మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ( Health Ministry ) సోమవారం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాలతో దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 31,06,349కి చేరగా.. మరణాల సంఖ్య 57,542కి పెరిగింది. Also read: TSCETS 2020: తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు ఇవే..
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 7,10,771 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అయితే ఆదివారం ఒక్కరోజే కరోనా నుంచి 57,468 బాధితులు కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో 24 గంటల్లో 6,09,917 కరోనా టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ ( ICMR ) తెలిపింది. దీంతో మొత్తం 3.59 కోట్లకు పైగా పరీక్షలు చేసినట్లు వెల్లడించింది. ఇలాఉంటే.. దేశంలో కరోనా రికవరీ రేటు 75శాతం దాటగా.. మరణాల రేటు 1.85గా ఉంది. Also read: Vijay Devarakonda: టాలీవుడ్ నుంచి ఒకే ఒక్కడు