Vijay Devarakonda: టాలీవుడ్ నుంచి ఒకే ఒక్కడు

టాలీవుడ్‌ ( Tollywood ) తోపాటు పలుభాషల్లో తిరుగులేని అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ. విలక్షణమైన నటన, ప్రత్యేకమైన ఆటిట్యూడ్‌‌తో రౌడీ స్టార్‌గా ముద్రవేసుకున్నాడు.

Last Updated : Aug 24, 2020, 09:57 AM IST
Vijay Devarakonda: టాలీవుడ్ నుంచి ఒకే ఒక్కడు

Most Desirable Men 2019: టాలీవుడ్‌ ( Tollywood ) తోపాటు పలుభాషల్లో తిరుగులేని అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ. విలక్షణమైన నటన, ప్రత్యేకమైన ఆటిట్యూడ్‌‌తో రౌడీ స్టార్‌గా ముద్రవేసుకున్నాడు. తాజాగా విజయ్‌ దేవరకొండ ( Vijay Devarakonda ) ఇండియన్‌ టాప్‌ 10 మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్‌ జాబితాలో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా సంస్థ ఆన్‌లైన్‌ ద్వారా  'మోస్ట్ డిజైరబుల్ మెన్ ఇన్ ఇండియా' నిర్వహించిన ఈ పోటీలో మొదటిస్థానంలో షాహిద్‌కపూర్‌ నిలవగా రెండో స్థానాన్ని రణ్‌వీర్‌సింగ్‌ సొంతం చేసుకున్నారు. వారి తర్వాతి స్థానంలో విజయ్‌ దేవరకొండ నిలిచారు. అయితే విజయ్ దేవరకొండ మినహా టాలీవుడ్ నుంచి మరేఇతర నటులు టాప్ 10లో స్థానాన్ని దక్కించుకోకపోవడం గమనార్హం. అర్జున్ రెడ్డి, గీతాగోవిందం తరువాత వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్నప్పటికీ విజయ్‌కు రౌడీ ఫ్యాన్స్‌ ( Rowdy fans club )లో ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని నిరూపితమవుతోంది. Also read: Vijay Deverakonda: రూ.100 కోట్ల భారీ బడ్జెట్ సినిమాకు ప్లాన్ ?

విజయ్‌ ఇంతకుముందు హైదరాబాద్‌ మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్‌గా 2018,19 సంవత్సరాల్లో నంబర్‌వన్‌ స్థానాన్ని దక్కించుకున్నాడు. అయితే.. విజయ్ ప్రస్తుతం పూరిజగన్నాథ్‌ దర్శకత్వంలో ఫైటర్‌ సినిమాలో నటిస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో  తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది.  Also read: Birthday Gift to Chiranjeevi: చిరంజీవికి చిరకాల మిత్రుడి బర్త్ డే గిఫ్ట్ అదుర్స్..

Trending News