OLD Parliament History: కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారత పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైన క్రమంలో అందరి దృష్టీ ఇప్పటి వరకూ ఉన్న పార్లమెంట్ భవనంపై పడింది. ఇప్పుడున్న పార్లమెంట్ భవనానికి దాదాపు వందేళ్ల చరిత్ర ఉంది. ఈ భవనం ఎప్పుడు, ఎవరు నిర్మించారు, అప్పటి ఆర్కిటెక్చర్లు ఎవరనే వివరాలు ఆసక్తి రేపుతున్నాయి. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొత్త పార్లమెంట్


దేశంలో మే 28వ తేదీ సరికొత్త అధ్యాయానికి వేదిక కానుంది. దాదాపు వందేళ్లుగా శాసనాలు రూపొందిస్తూ పాలన సాగిస్తున్న పార్లమెంట్ స్థానంలో కొత్త భవనం రూపుదిద్దుకుంది. 64,500 చదరపు మీటర్ల పరిధిలో నిర్మించిన కొత్త పార్లమెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు రెండు అంతస్థుల్లో ఉంటుంది. ఒకేసారి 1224 మంది ఎంపీలు కూర్చునేందుకు వీలుగా నిర్మాణం జరిగింది. లోక్‌సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేందుకు అనువైన నిర్మాణం చేపట్టారు. ఈ నేపధ్యంలో పాత పార్లమెంట్ చరిత్ర ఏంటి, ఎవరు ఎప్పుడు నిర్మించారు, ఎప్పట్నించి ప్రారంభమైందనే వివరాలు తెలుసుకుందాం..


మరో నాలుగేళ్లయితే పాత పార్లమెంట్ భవనానికి వందేళ్లు 


దేశంలో ఇప్పుడున్న పాత పార్లమెంట్ భవనానికి దాదాపు వందేళ్ల చరిత్ర ఉంది. రాజసం ఒలికిస్తూ ఠీవిగా నిలబడిన పార్లమెంట్ భవనాన్నిడిజైన్ చేసిన బ్రిటీషు ఆర్కిటెక్చర్లు ఎడ్విన్ లూటియన్స్ , హెర్బర్ట్ బేకర్. దేశానికి కొత్త పరిపాలనా రాజధాని నిర్మించే ఉద్దేశ్యంతో బ్రిటీషు ప్రభుత్వం 1912-13 రూపకల్పన జరిగింది. ఇక నిర్మాణం 1921లో ప్రారంభమై 1927లో పూర్తయింది.


ప్రిన్స్ ఆర్ధర్, డ్యూక్ ఆఫ్ కన్నాట్ అండ్ స్ట్రెయిట్ హెమ్‌లు 1921 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేయగా ఐదేళ్లలో నిర్మాణం పూర్తి చేసుకుంది. 1927 జనవరి 18వ తేదీన ప్రారంభోత్సవానికి రావల్సిందిగా భారత వైస్రాయ్ జనరల్ లార్డ్ ఇర్విన్‌ను అప్పటి గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు భూపేంద్రనాథ్ మిత్రా ఆహ్వానించారు. 1927, జనవరి 19వ తేదీన సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మూడవ సెషన్‌తో పార్లమెంట్ భవనం ప్రారంభమైంది.  ఆ తరువాత డిమాండ్ దృష్టిలో ఉంచుకుని 1956లో మరో రెండు అంతస్థులు నిర్మించారు. ప్రస్తుత పాత పార్లమెంట్ సీటింగ్ సామర్ధ్యం 790 సీట్లు. 


పాత పార్లమెంట్ ఆకారం వృత్తాకారంలో గుండ్రంగా ఉంటుంది. బిల్డింగ్ మధ్యలో వృత్తాకారంలో సెంట్రల్ ఛాంబర్ ఉంటుంది. చుట్టూ మూడు అర్ధ వృత్తాకార హాల్స్ ఉంటాయి. ఇందులో ఒకటి ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ లేదా ఇప్పటి లైబ్రరీ , రెండవది స్టేక్ కౌన్సిల్ లేదా ఇప్పటి రాజ్యసభ, మూడవది సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదా ఇప్పటి లోక్‌సభగా ఉన్నాయి. 1927 నుంచి 1947 వరకూ అంటే 20 ఏళ్లపాటు ఇప్పటి పార్లమెంట్ భవనానికి యజమానిగా బ్రిటీష్ ఇండియా ఉంది. ఇక 1950 నుంచి భారత ప్రభుత్వం యాజమాన్య హక్కుల్ని పొందింది. 


కొత్త పార్లమెంట్ భవన నిర్మాణంపై 2010లో ప్రతిపాదన వచ్చింది. అప్పట్లో భవన నిర్మాణంపై పలు ప్రశ్నలు రేకెత్తాయి. దాంతో 2012లో అప్పటి స్పీకర్ మీరా కుమార్ ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ తరువాత 2019లో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ విస్తా రీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు లాంచ్ చేసింది. అదే ఇప్పుుడు నిర్మాణం పూర్తి చేసుకున్న కొత్త పార్లమెంట్ భవనం.


Also read: Unknown Facts About Narendra Modi: ప్రధాని మోడీ గురించి మీకు తెలియని విషయాలు ఇవే, ఇలా తెలుసుకోండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook