India makes 10-day quarantine must for all UK travellers: న్యూ ఢిల్లీ: క్వారంటైన్ విషయంలో భారత్ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌కి వెళ్లిన వారికి వ్యాక్సిన్ తీసుకోవడంతో సంబంధం లేకుండా అక్కడి ప్రభుత్వం 10 రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్ నిబంధన విధించిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ సైతం యునైటెడ్ కింగ్‌డమ్‌కి అదే తరహాలో బుద్ధి చెబుతూ అక్కడి నుంచి భారత్‌కి వచ్చిన వారికి వారి వ్యాక్సినేషన్ స్టేటస్‌తో (Vaccination status) సంబంధం లేకుండా 10 రోజుల పాటు క్వారంటైన్ తప్పనిసరి చేసింది. అక్టోబర్ 4 నుంచి ఈ నిబంధన అమలులోకి రానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత సర్కారు తీసుకున్న నిర్ణయం ప్రకారం యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి భారత్ వచ్చిన ప్రయాణికులు భారత్‌లో అడుగు పెట్టడంతోనే క్వారంటైన్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాకుండా మొత్తం మూడు సందర్భాల్లో కొవిడ్ పరీక్షలు (COVID-19 RT-PCR tests) చేయించుకోవాల్సి ఉంటుంది. 


భారత గడ్డపై అడుగుపెట్టడానికి మూడు రోజుల ముందు ఒకసారి కొవిడ్-19 పరీక్ష చేసుకోవాల్సి ఉండగా ఆ తర్వాత భారత్ రావడంతోనే రెండోసారి కొవిడ్-19 పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా భారత్‌కి వచ్చిన తర్వాత క్వారంటైన్ పీరియడ్‌లో (Quarantine for travellers from UK) ఉండగానే వారం రోజులకు మరోసారి కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. 


Also read : India Hits Back At China: చైనా ఆరోపణలను తిప్పికొట్టిన భారత్.. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోన్న చైనా


అంతకంటే ముందుగా యుకేలో జరిగిన పరిణామాలను ఒకసారి పరిశీలించినట్టయితే.. విదేశాల నుంచి వచ్చిన వారు రెండో డోస్ వ్యాక్సిన్‌ (COVID-19 vaccine second dose) తీసుకున్నప్పటికీ వారు 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా స్పష్టంచేస్తూ యూకే సర్కారు నిర్ణయం తీసుకుంది. అలా యూకే సర్కారు (UK government on Indian COVID vaccine certificate) క్వారంటైన్ తప్పనిసరి చేసిన విదేశీయుల జాబితాలో భారతీయులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే భారత సర్కారు సైతం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.


Also read : Australia: కోవిషీల్డ్ , సినోవాక్ వ్యాక్సిన్లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ఆస్ట్రేలియా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook