India Hits Back At China: చైనా ఆరోపణలను తిప్పికొట్టిన భారత్.. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోన్న చైనా

India hits out at China : చైనా చేసిన ఆరోపణలపై ఇండియా స్పందించింది. ఈ విషయంలో తీవ్రంగా మండిపడింది. డ్రాగన్‌ కవ్వింపు చర్యలు, ఏకపక్ష నిర్ణయాల వల్లే సరిహద్దుల్లో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని భారత్‌ స్పష్టం చేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 1, 2021, 05:24 PM IST
  • చైనా చేసిన ఆరోపణలను తిప్పి కొట్టిన ఇండియా
  • డ్రాగన్‌ కవ్వింపు చర్యలు, ఏకపక్ష నిర్ణయాల వల్లే సరిహద్దుల్లో శాంతి భద్రతలకు విఘాతం
  • భారత్‌పై నోరుపారేసుకున్న చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్
India Hits Back At China: చైనా ఆరోపణలను తిప్పికొట్టిన భారత్.. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోన్న చైనా

India Hits Back At China, Points To Provocative Behaviour In Ladakh Row : భారత్.. వాస్తవాధీన రేఖను దాటి వచ్చి తమ భూభాగాన్ని ఆక్రమిస్తోందంటూ చైనా (China) చేసిన ఆరోపణలపై ఇండియా స్పందించింది. ఈ విషయంలో తీవ్రంగా మండిపడింది. డ్రాగన్‌ (dragon) కవ్వింపు చర్యలు, ఏకపక్ష నిర్ణయాల వల్లే సరిహద్దుల్లో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని భారత్‌ (India) స్పష్టం చేసింది. భారత్, చైనా సరిహద్దుల (china border) వెంట చైనా సైన్యమే నిరంతరం భారీ మోహరింపులకు దిగుతోందని భారత్‌ తెలిపింది. అందుకు ప్రతిస్పందనగానే భారత దళాలు అప్రమత్తమయ్యాయని వెల్లడించింది. 

చైనా భూభాగాన్ని భారత్‌ ఆక్రమిస్తోంది..

చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్ (Hua Chunying) తాజాగా భారత్‌పై నోరుపారేసుకున్నారు. లద్దాఖ్‌ (ladakh) సరిహద్దుల్లో గతేడాది నుంచి నెలకొన్న ఉద్రిక్తతలకు మూలకారణం దిల్లీనే అని అన్నారు. అంతేకాదు వాస్తవాధీన రేఖను దాటి వచ్చి చైనా భూభాగాన్ని భారత్‌ ఆక్రమిస్తోందని నోటికొచ్చినట్లు మాట్లాడారు.

Also Read : Australia: కోవిషీల్డ్ , సినోవాక్ వ్యాక్సిన్లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ఆస్ట్రేలియా

ఏకపక్ష నిర్ణయాలకు చైనా దిగుతోంది..

ఈ ఆరోపణలపై భారత్ స్పందించింది. చైనా చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం, నిరాధారమైనవి కొట్టిపారేసింది భారత్ (India). సరిహద్దుల వెంబడి చైనా సైన్యం నిరంతరం భారీగా బలగాలను మోహరిస్తోందని స్పష్టం చేసింది భారత్. ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కనబెట్టి రెచ్చగొట్టే చర్యలు, ఏకపక్ష నిర్ణయాలకు చైనా దిగుతోందని భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి ఆరిందమ్‌ బాగ్చి (Arindam Bagchi) అన్నారు. చైనా చర్యలకు ప్రతిస్పందనగానే భారత్‌ కూడా బలగాలను మోహరిస్తోందని స్పష్టం చేశారు. చైనా (China) వల్లే తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి భద్రతలకు ఆటంకం కలుగుతోందని ఆరిందమ్‌ బాగ్చి తెలిపారు.

Also Read : MAA Elections 2021: షాకిచ్చిన బండ్ల గణేష్.. నామినేషన్ తిరస్కరించుకున్న నిర్మాత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News