భారత నావికదళం ( Indian Naval ) లో మరో అత్యాధునిక యుద్ధనౌక వచ్చి చేరింది. విశాఖపట్నంలోని తూర్పు నావికాదళం ( Eastern naval command ) సముద్రజలాల్లో యాంటీ స‌బ్‌మెరైన్ యుద్ధనౌక వచ్చి చేరడంతో ప్రత్యర్దులకు బలమైన హెచ్చరిక వెళ్లింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


సరిహద్దు ఉద్రిక్తతల నేపధ్యంతో వైమానిక, నావికా దళాల్ని భారతదేశం పటిష్టం చేసుకుంటోంది. రాఫెల్ ( Rafale ) యుద్ధవిమానాలతో ఇప్పటికే వైమానిక దళం బలోపేతమైంది. ఇప్పుడు అత్యాధునిక యాంటీ స‌బ్‌మెరైన్ ( Anti submarine ) యుద్ధనౌక నావికాదళంలో వచ్చి చేరింది. భారత నావికాదళంలో ప్రముఖంగా ఉన్న విశాఖపట్నం తూర్పు నావికాదళం దీనికి వేదికైంది. 


బంగాళాఖాతం ( Bay of Bengal ) లో అప్రమత్తంగా ఉండేందుకు తూర్పు నావికాదళం కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే ఇప్పుడీ నూతన అత్యాధునిక స‌బ్‌మెరైన్ ( Most Advanced Anti Submarine )  యుద్ధనౌక ఐఎన్ఎస్ కవరట్టి (  INS kavaratti ) ని విశాఖపట్నం సముద్రజలాల్లో ప్రవేశపెట్టారు. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో.. విరోధులకు బలమైన హెచ్చరికను జారీ చేశారు. ఆర్మీ చీఫ్‌ ఎంఎం నరవణే ( Army Chief M M Naravane ) ఈ యుద్ధనౌకను కమిషన్‌ చేశారు. ప్రాజెక్ట్‌ 28 ( కమోర్టా క్లాస్‌ ) లో భాగంగా నిర్మించిన 4 యాంటీ సబ్‌మెరైన్‌ యుద్ధ నౌకల్లో ఐఎన్‌ఎస్‌‌ కవరట్టి చివరిది. డైర‌క్ట‌రేట్ ఆఫ్ నేవ‌ల్ డిజైన్ దీన్నిడిజైన్ చేసింది. కోల్‌క‌తాకు చెందిన గార్డెన్ రీసెర్చ్ షిప్‌ బిల్డ‌ర్స్ అండ్ ఇంజినీర్స్ ఈ యుద్ధనౌకను నిర్మించింది. రోజురోజుకూ విస్తరిస్తున్న భారత నౌకాదళం, జీఆర్‌ఎస్‌ఈ సామర్థ్యాన్ని చూపించడమే కాకుండా దేశీయంగా తయారు చేయగలగడంతో భారత దేశం స్వావలంబనకు నిదర్శనంగా నిలుస్తుంది ఈ యుద్ధనౌక. మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ ( Pm modi ) నిర్దేశించిన జాతీయ లక్ష్యం ఆత్మ నిర్భర్‌ భారత్‌ని ఉద్ఘాటిస్తుంది.



ఐఎన్ఎస్ కవరట్టిలో అత్యాధునిక ఆయుధాలు, జలాంతర్గాములను గుర్తించి అప్పటికప్పుడు ప్రాసిక్యూట్‌ చేయగల సెన్సార్‌ సూట్‌ ఉందని భారత నావికాదళం తెలిపింది. దాదాపు 90 శాతం ఐఎన్‌ఎస్‌ కవరట్టి నిర్మాణం దేశీయంగానే పూర్తయింది. ఈ యుద్ధనౌక అన్నిరకాల సముద్రపరీక్షల్ని పూర్తి చేసింది. కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా అన్నిఆంక్షలను పరిగణనలోకి తీసుకుని.. ఐఎన్ఎస్ కవరట్టిని నేవీకు అందించడం నిజంగానే ఓ అద్భుత విజయమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐఎన్ఎస్ కవరట్టి ప్రవేశంతో భారత నావికాదళ సంసిద్ధత మెరుగు పడుతుంది. ఆర్నాలా-క్లాస్ క్షిపణి కొర్వెట్టి నుంచి ఐఎన్ఎస్ కవరట్టికు ఆ పేరు వచ్చింది. ఇదే శ్రేణిలో పాత యుద్ధనౌక 1971లో జరిగిన బంగ్లాదేశ్ విమోచన ఉద్యమానికి మద్దతుగా పని చేసింది. Also read: South Central Railway: ఏపీలోని ఆ 20 పాసెంజర్ రైళ్లు ఇకపై ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు