South Central Railway: ఏపీలోని ఆ 20 పాసెంజర్ రైళ్లు ఇకపై ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

దేశవ్యాప్తంగా పాసెంజర్ రైళ్ల విషయంలో భారతీయ రైల్వేబోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని ప్రత్యేక పాసెంజర్ ట్రైన్లను ఎక్స్‌ప్రెస్‌ రైళ్లుగా అప్‌గ్రేడ్‌ చేస్తోంది. ఏపీ పరిధిలో మొత్తం 20 రైళ్లు ఇలా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లుగా అప్‌గ్రేడ్‌ అవుతున్నాయి.

Last Updated : Oct 22, 2020, 12:05 PM IST
South Central Railway:  ఏపీలోని ఆ 20  పాసెంజర్ రైళ్లు ఇకపై ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

దేశవ్యాప్తంగా పాసెంజర్ రైళ్ల విషయంలో భారతీయ రైల్వేబోర్డు ( Indian Railway Board ) కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని ప్రత్యేక పాసెంజర్ ట్రైన్లను ఎక్స్‌ప్రెస్‌ రైళ్లుగా అప్‌గ్రేడ్ ( Upgraded passenger trains as Express )‌ చేస్తోంది. ఏపీ పరిధిలో మొత్తం 20 రైళ్లు ఇలా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లుగా అప్‌గ్రేడ్‌ అవుతున్నాయి.

నిన్నటి వరకూ పాసెంజర్లుగా ఉన్న ఆ రైళ్లు ఇకపై ఎక్స్‌ప్రెస్‌లుగా మారబోతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ( South Central Railway ) పరిధిలోని విజయవాడ, గుంటూరు డివిజన్లలో నడుస్తున్న దాదాపు 20  పాసింజర్ రైళ్ల ( 20 Passenger trains ) ను  ఎక్స్‌ప్రెస్‌ రైళ్లుగా మార్చింది ఇండియన్ రైల్వే.  

భారతీయ రైల్వే ఈ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా తీసుకుంది. వివిధ జోన్ల పరిధిలో నడుస్తున్న పాసింజర్‌ రైళ్ల ( Passenger trains ) ను ఎక్స్‌ప్రెస్‌ లేదా మెయిల్‌లుగా మార్పు చేయడానికి నిర్ణయించుకుంది. పాసెంజర్‌ రైళ్లు గమ్యాన్ని చేరడంలో ఆలస్యమవుతుండటం..వ్యయభారాన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్స్‌ప్రెస్‌లుగా అప్‌గ్రేడ్‌ చేయాల్సి వస్తోందని రైల్వే బోర్డు ( Railway Board ) తెలిపింది. దేశంలోని వివిధ జోన్ కార్యాలయాల్నించి వచ్చిన ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయమైంది. అయితే ఈ రైళ్లు ఎప్పట్నించి ఎక్స్‌ప్రెస్‌లుగా మారుతున్నాయనేది  మాత్రం రైల్వే బోర్డు ఇంకా స్పష్టం చేయలేదు. ప్రస్తుతం కోవిడ్‌ వైరస్ నేపథ్యంలో కొన్ని స్పెషల్‌ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. పూర్తి స్థాయిలో రెగ్యులర్‌ రైళ్లను నడపడం ప్రారంభించాకే..కొత్తగా అప్‌గ్రేడ్‌ అయిన రైళ్లను నడపనున్నారు. 

ఈ రైళ్లు ఎక్స్‌ప్రెస్‌లుగా ( Express trains ) మారితే ప్రయాణ వేగం మరింతగా పెరిగి..గమ్యానికి చేరుకునే సమయం బాగా తగ్గుతుంది. దీంతో ప్రయాణ కాలం కలిసొస్తుంది. అయితే ప్రస్తుతం  పాసెంజర్లు ఆగుతున్న హాల్టుల్లో ఇకపై ఇవి ఆగవు. కొన్ని ప్రత్యేక పాసెంజర్ రైళ్ల హాల్ట్ లలో మాత్రమే ఎక్స్‌ప్రెస్‌లు ఆగనున్నాయి. కొన్ని ముఖ్య స్టేషన్లలో హాల్ట్‌ ఇచ్చే అవకాశం ఉంది. మిగిలిన పాసెంజర్ ట్రైన్లు మాత్రం యధావిధిగా అన్ని స్టేషన్లలో ఆగుతాయి. కొత్తగా ఎక్స్‌ప్రెస్‌లుగా మారాక ఈ రైళ్లలో స్లీపర్‌ క్లాస్‌, థర్డ్‌ ఏసీ కోచ్‌లతో పాటు రిజర్వేషన్‌ సౌకర్యం వర్తించనుంది. 

ఇప్పుడు కొత్తగా అప్‌గ్రేడ్‌ అయిన పాసెంజర్ రైళ్లలో మచిలీపట్నం - విశాఖపట్నం, తిరుపతి - గుంటూరు, నర్శాపురం - విశాఖపట్నం, కాకినాడ పోర్ట్ - విజయవాడ, గుంటూరు - నర్శాపురం, రేపల్లె - సికింద్రాబాద్, కాచిగూడ - గుంటూరు, గూడూరు - విజయవాడ,  డోన్ - గుంటూరు, గుంటూరు - నర్శాపురం రైళ్లున్నాయి. అయితే ఎక్స్‌ప్రెస్‌లుగా మారిన కారణంగా ఇప్పటివరకూ ఈ రైళ్లపై ఆధారపడి ప్రయణాలు సాగిస్తున్న సామాన్యులకు ఇబ్బంది కలగనుంది. ఎందుకంటే ఎక్స్‌ప్రెస్‌లుగా మారాక టికెట్ ధర పెరగడంతో పాటు అన్ని స్టేషన్లలో రైళ్లు నిలిచే అవకాశాల్లేవు.  Also read: Shahnawaz Hussain: బీజేపీ అధికార ప్రతినిధికి కరోనా పాజిటివ్

Trending News