కరోనా సంక్షోభం ( Corona crisis ) లో సైతం భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ( Infosys ) లాభాల్ని ఆర్జించింది. తొలి త్రైమాసికం ( First Quarter ) ముగింపులో గత ఏడాదితో పోలిస్తే 12 శాతం వృద్ధితో మెరుగైన ఫలితాల్ని సాధించింది. క్యూ 1 లో భారీ డీల్స్  సాధించడమే నికర లాభాలకు కారణమని కంపెనీ వెల్లడిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా సంక్షోభం నేపధ్యంలో ప్రపంచమంతటా ఆర్ధిక మాంద్యం నెలకొంది. పలు పరిశ్రమలు కుదేలైన పరిస్థితి . అయినా సరే భారతీయ ఐటీ దిగ్గజం ( Indian It company ) ఇదే తొలి త్రైమాసికంలో లాభాల్ని ఆర్జించడం గమనార్హం. ఈ ఏడాది జూన్ అంటే తొలి క్వార్టర్ ముగింపుకు 4 వేల 272 కోట్ల నికర లాభాన్ని సాధించింది ఇన్ఫోసిస్ కంపెనీ ( Infosys ) . గత ఏడాది ఇదే సమయానికి కంపెనీ నికర లాభం 3 వేల 802 కోట్లుగా ఉంది. అంటే గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత కరోనా సంక్షోభపు త్రైమాసికం ( Quarter ) లో కంపెనీ 12 శాతం వృద్ధి సాధించింది. క్యూ 1లో భారీ డీల్స్ రావడం వల్లనే నికరలాభం పెరిగిందని కంపెనీ వెల్లడించింది. అటు ఆదాయం కూడా 21 వేల 803 కోట్ల నుంచి 9 శాతం వృద్ధితో 23 వేల 665 కోట్లకు పెరిగింది. ఈ ఆర్ధిక సంవత్సరం అంటే 2020-21లో కంపెనీ ఆదాయం స్థిరంగా 1.5 శాతం ఉండవచ్చని అంచనా వేస్తున్నాయి కంపెనీ వర్గాలు. Also read: Twitter Hacked: ఒబామా, బిల్ గేట్స్ ట్విట్టర్ ఎకౌంట్స్ హ్యాక్


అటు ఉద్యోగాల పరంగా కూడా కంపెనీ 20 వేలమంది ఫ్రెషర్స్ కు అవకాశాలు కల్పించింది. ఇప్పటికే 90 శాతం మంది ఉద్యోగాల్లో చేరినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. క్వార్టర్ 1 ఫలితాలు సానుకూలంగా ఉండటంతో కంపెనీ షేర్ 6 శాతం లాభంతో 831 రూపాయల వద్ద నిన్న ముగిసింది. ఆల్‌టైమ్ హైక్ 848 రూపాయలుగా ఉంది. Also read: Jio Glass price: జియో గ్లాస్ ధర ఎంత ? ఫీచర్స్ ఏంటి ?