ICAI CA 2024 Results: ఐసీఏఐ సీఏ ఫౌండేషన్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి
ICAI CA 2024 Results: ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ ఎక్కౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఇటీవల జరిగిన CA పరీక్షల ఫలితాలు విడుదల చేసింది. మీ అప్లికేషన్ నెంబర్ సహాయంతో ఆన్లైన్లో ఫలితాల్ని ఇలా చెక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు మీ కోసం.
ICAI CA 2024 Results: ఛార్టెర్డ్ ఎక్కౌంటెంట్ ఫౌండేషన్ పరీక్ష 2024 ఫలితాలు వెల్లడయ్యాయి. ఇండియన్ ఛార్టర్డ్ ఎక్కౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ICAI ఈ ఫలితాలను విడుదల చేసింది. icai.org లేదా icai.nic.in అధికారిక వెబ్‌సైట్స్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.
ఐసీఏఐ సీఏ ఫౌండేషన్ 2023 రిజిస్ట్రేషన్ డిసెంబర్ వరకూ కొనసాగడంతో డిసెంబర్ 31, జనవరి 2, 4, 6 తేదీల్లో సీఏ ఫౌండేషన్ పరీక్ష జరిగింది. ఈ పరీక్ష ఫలితాల్ని ఇవాళ ఐసీఏఐ విడుదల చేసింది. ఈ పరీక్షకు మొత్తం 1.37,153 మంది హాజరు కాగా వీరిలో 41,132 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం పరీక్ష రాసినవారిలో 71,966 మంది బాలురు కాగా, 65,187 మంది బాలికలున్నారు. ఇక ఉత్తీర్ణత పొందినవారిలో బాలురు 21, 728 కాగా, బాలికలు 19,404 మంది ఉన్నారు. icai.org లేదా icai.nic.in వెబ్‌సైట్ ద్వారా సీఏ ఫౌండేషన్ పరీక్ష ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి.
ముందుగా అధికారి వెబ్‌సైట్ icai.org లేదా icai.nic.in ఓపెన్ చేయాలి. హోమ్ పేజిలో కన్పించే లింక్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఐసీఏఐ సీఏ ఫౌండేషన్ ఫలితం 2024 డిక్లేర్డ్ లింక్ ఓపెన్ చేయాలి. తరువాత పేజిలో చెక్ రిజల్ట్స్ క్లిక్ చేసి అభ్యర్ధి వివరాలతో లాగిన్ కావాలి. అంతే మీ ఫలితం స్క్రీన్‌పై కన్పిస్తుంది.
Also read: Best Investment plans: మీ అమ్మాయి భవిష్యత్‌కు బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook